»   » వేషం ఇప్పిస్తానని మోసం,దాడి ...నటుడు అరెస్టు

వేషం ఇప్పిస్తానని మోసం,దాడి ...నటుడు అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సినిమాల్లో నటిస్తానంటే డబ్బు ఇవ్వాలనే ఆలోచన కొంతమంది మోసగాళ్లకు ఊతమిస్తోంది. అంతేకాని ప్రతిభ ఉంటే వాళ్లంతట వాళ్లే రాణిస్తారనే ఆలోచన లేకపోవటంతో మోసానికి లోను అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు తెలుగు,తమిళ, హింది అనే భాషా భేధం లేకుండా అన్ని చోట్లూ ఇంకా ఈ రోజుల్లో కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే...

తనకు తెలిసి సినిమాలో నటించడానికి అవకాశమిప్పిస్తానంటూ,మంచి క్యారక్టర్ ఉందని నమ్మబలికి ఓ వ్యక్తిని మోసం చేసిన సహాయ నటుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు నగరంలో కాశిమేడుకు చెందిన దీపక్‌ ప్రసన్న సెల్‌ఫోన్‌ సర్వీసు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అతను అదే ప్రాంతానికి చెందిన నిరంజన్‌ అనే సినిమా నటుడితో పరిచయం చేసుకున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Budding actor arrested in Cheating Case

దీపక్‌ ప్రసన్నకు కూడా సినిమాలో నటించే అవకాశమిప్పిస్తానని నిరంజన్‌ నమ్మబలికాడు. అందుకు రూ.2 లక్షలు డిమాండు చేయగా ఆ మొత్తాన్ని దీపక్‌ ప్రసన్న అతనికి అందజేశాడు. అయితే ఇచ్చిన హామీ మేరకు సినిమాలో అవకాశమిప్పించక పోవడంతో దీపక్‌ నిరంజన్‌ ఇంటికి వెళ్లి అతనిని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన నిరంజన్‌ అతని కుటుంబ సభ్యులు లెనిన్‌, కార్తిక్‌లు కలిసి దీపక్‌ ప్రసన్న, అతని ఇద్దరి స్నేహితులపై దాడి చేశారు.

తీవ్ర గాయాలకు గురైన దీపక్‌ ప్రసన్నను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వారు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిరంజన్‌, అతని కుటుంబ సభ్యులు ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు ధర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

English summary
Police arrested a budding film actor and two of his brothers near Kasimedu in a cheating case, . The budding actor, Niranjan, cheated a youth Deepak Saravanan of Kasimedu of Rs1 lakh after promising him a chance in movies. The accused initially took Rs 2 lakh and returned half of it as he couldn’t keep his word.
Please Wait while comments are loading...