»   » సల్మాన్ పైనే కళ్యాణ్ రామ్ హీరోయిన్ ఆశలు

సల్మాన్ పైనే కళ్యాణ్ రామ్ హీరోయిన్ ఆశలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sana khan
చెన్నై : కళ్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో చేసిన సనా ఖాన్ గుర్తుందా..పోనీ... మంచు మనోజ్ సరసన మిస్టర్ నోకియా చిత్రంలో కనిపించిన హీరోయిన్ గుర్తుందా. ఆ సనా ఖాన్ అవకాశాల కోసం దక్షిణాది అంతా చుట్టేసింది. కష్టపడి తెలుగు, తమిళ భాషల్లో ఒకట్రెండు సినిమాలు చేసింది. అయితే ఆమె నటించిన సినిమాలేవీ ఆదరణ సొంతం చేసుకోలేదు. దీంతో అవకాశాలు కూడా రాలేదు. చేసేదేం లేక బాలీవుడ్‌ వెళ్లిపోయింది.

బాలీవుడ్ లో మాత్రం ఎవరూ వూహించని రీతిలో సల్మాన్‌ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకొంది. 'స్టాలిన్‌' రీమేక్‌గా తెరకెక్కుతున్న 'జయహో'లో సల్మాన్‌ సరసన హొయలుపోయింది. ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు కూడా రాలేదు. అప్పుడే సనాఖాన్‌ బిజీ అయిపోయింది.

కొత్తగా ఏ సినిమా కూడా ఒప్పుకోవడం లేదట. 'జయహో' సినిమా విజయం సాధిస్తే... నా రేంజ్‌ మారిపోతుంది కదా అని సెలవిస్తోందట. ఇటీవల తమిళ హీరో సూర్య సినిమాలో ఓ ప్రత్యేకగీతం కోసం సనాఖాన్‌ని ఆశ్రయించారు. ఆ అవకాశాన్ని ఆమె నిర్ద్వందంగా తోసిపుచ్చిందట. 'జయహో' ప్రచారంలో ఉన్నాను కాబట్టి.. నేను కాల్షీట్లు సర్దుబాటు చేయలేనని చెప్పిందట. సనాఖానా మజాకా... మరి అంటున్నారు.

'జయహో' విషయానికి వస్తే...తెలుగులో వచ్చిన స్టాలిన్‌ను ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించాడు. ఇది కూడా కెవిన్‌ స్పాసీ హాలీవుడ్‌ చిత్రం 'పే ఇట్‌ ఫార్వర్డ్‌'కు ప్రేరణగా అనిపిస్తుంది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆయన తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ దర్శకత్వం వహించడంతో పాటు సునీల్‌ లుల్లాతో కలిసి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మొదట ఈ చిత్రానికి 'మెంటల్‌' అని పేరు పెట్టినప్పటికీ దాన్ని ఇప్పుడు 'జై హో' గా మార్చారు.

ఈ రోజుల్లో చలన చిత్రాలను కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించడమే కాకుండా ఆ చిత్రం ప్రజల్లోకి వెళ్ళడానికి మరిన్ని కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అంతే కాకుండా ఆ ప్రచారం కూడా ఎంతో వినూత్నంగా ఉండేలా నిర్మాతలే కాకుండా హీరోలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ చిత్రమంటే ప్రేక్షకుల్లో ఉత్కంఠ సహజం. అదీ కాకుండా 'ఏక్‌ థా టైగర్‌' తర్వాత ఒకటిన్నర సంవత్సరం సుదీర్ఘ వ్యవధిలో సల్మాన్‌ ఖాన్‌ చిత్రం విడుదల కావడంతో అందరూ ఎంతో ఆత్రంగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తన అభిమానులను నిరాశపరచకుండా సల్మాన్‌ ఖాన్‌ కూడా తన తదుపరి చిత్రం 'జై హో' ప్రచారంలో భాగంగా విడుదల చేసే ఫిల్మ్‌ పోస్టరులో అంతే ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు.

English summary
Sana Khan had refused to dance for a Kuthu song in Surya’s film. Sana Khan had acted in the Tamil films Silambattam, Thambikku Indha Ooru,Payanam, Aayiram Vilakku. She donned the role of Silk Smitha in the film titled Climax. Since she did not get any offers in Tamil, she migrated to Bollywood. Sana Khan participated in the Big Boss Reality Show. Salman Khan who is anchoring this show gave Sana Khan an opportunity to don the female lead role in his Hindi film titled Jai Ho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu