»   » నాగచైతన్య దర్శకుడుపై చీటింగ్ కేసు

నాగచైతన్య దర్శకుడుపై చీటింగ్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gautham Menon
చెన్నై : నాగచైతన్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఏ మాయ చేసావే చిత్రం రూపొందిన గౌతమ్ మీనన్ ఇప్పుడు చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. గౌతమ్ మీనన్ పై కేసు నమోదు చేయాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో గౌతమ్ మీనన్ తో పాటు ఫోటాస్ కథాస్ హౌస్ ప్రొడక్షన్ కు చెందిన మరో నలగురిపై కేసు నమోదు చేయలని చెప్పింది.

ఏ మాయ చేసావే చిత్రం రీమేక్ గా రూపొందిన ఏక్ దివానా థా చిత్రానికి సంభందించిన ఆర్దిక వ్యవహారాల్లో సుమారు తొమ్మిది కోట్ల రూపాయల మేరకు తన క్లయింట్ జయరామన్ ని చీట్ చేసారని ఆయన తరుపు న్యాయవాది బి రమేష్ బాబు తెలిపారు.

ఇక ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటీషన్ ను మద్రాస్ హై కోర్టు జస్టిస్ సిటీ సెల్వమ్ విచారించారు. ఈ పిటీషన్ ఆధారంగా కేసు నమేదు చేయాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటి కమీషనర్ కు ఆదేశాలు జారీ చేసారు.

గతంలోనూ గౌతమ్ మీనన్ పై 'నీథానే ఎన్‌ పోన్‌వసంతం' (తెలుగులో 'ఎటో వెళ్ళిపోయింది మనసు') నిర్మాత కేసులు పెట్టారు. ఆర్‌ఎస్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌కు చెందిన నిర్మాత ఎల్రెడ్‌ కుమార్‌తో మీనన్‌ పై వారు కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. చిత్రం ఆశించిన కలెక్షన్లు రాబట్ట లేకపోతే దర్శకుడి మీద కేసు పెట్టడం తగదని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.

'తమిళంలో 'నీథానే ఎన్‌ పోన్‌వసంతం' (తెలుగులో 'ఎటో వెళ్ళిపోయింది మనసు') చిత్రాన్ని తాను చాలా ఇష్టంగా నిర్మించానని, అయినా ఆ చిత్రం సరిగ్గా ఆడలేదని, ఆ నెపంతో నిర్మాత తనకు లీగల్‌ నోటీసులు పంపటం సరికాద'ని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో పరిశ్రమ తనకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వాలని నిర్మాత తనని డిమాండ్‌ చేశారని ఆయన తెలిపారు.

English summary
Ace director Gautam Menon landed in trouble. Madras High Court on Saturday directed central crime branch to register case on Gautam Menon and four others belonging to the Photon Kathas production house. Advocate B. Ramesh Babu in his position alleged that his client Jayaraman was cheated for an amount of Rs 9crs during the remake of kollywood hit Vinnaithaandi Varuyaaya as Ek Deewana Tha in Hindi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu