For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిలీజ్ రోజు తొక్కిసలాటలో...థియేటర్‌ యజమాని మృతి

  By Srikanya
  |

  చెన్నై: తమ థియోటర్లో ఆడుతున్న సినిమాకు వచ్చిన భారీ రద్దిని నియంత్రించబోయి థియేటర్‌ యజమాని మరణించిన సంఘటన తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూరులో జరిగింది. విజయ్‌ నటించిన 'కత్తి' చిత్రం ప్రదర్శన దీపావళి సందర్భంగా అక్కడి శ్రీలక్ష్మి థియేటరులో విడుదలైంది.

  వివరాల్లోకి వెళితే...కత్తి చిత్రాన్ని తిలకించేందుకు ఆయన అభిమానులు థియేటరు వెలుపల భారీ ఎత్తున చేరుకున్నారు. అక్కడ ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వారిని అదుపు చేసే పనులలో ఆ థియేటరు యజమాని కృష్ణన్‌(75) స్వయంగా రంగంలోకి దిగారు. థియేటరు ప్రధాన ద్వారాన్ని తీసిన వెంటనే ఒక్కసారిగా జనం లోనికిరావటంతో అక్కడే ద్వారం వద్ద రద్దీని నియంత్రించే పనిలో ఉన్న కృష్ణన్‌ నెమ్మదిగా వెళ్లాలంటూ వారిని సూచించారు.

  రద్దీని నియంత్రించే క్రమంలో ఆయన పడిపోయారు. జనం ఆయన్ను తొక్కుకుంటూ వెళ్లటంతో కృష్ణన్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. థియేటరు సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే కృష్ణన్‌ ప్రాణాలు వదిలారు.

  Cinema theatre owner dies in melee of 'Kaththi' fans

  కృష్ణన్‌ ఆకస్మిక మృతితో తిరునిండ్రవూరులో విషాధం నెలకొంది. చెన్నైకి 45 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రాంతంలో ఈయన ఇక్కడ 1987లో థియేటర్‌ను నిర్మించి డీలక్స్‌ థియేటరుగా ఆధునీకరించారు. అప్పట్లో దీనిని చూసి ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కూడా అభినందించారట.

  ఈయన ఎంజీఆర్‌కు వీరాభిమాని. థియేటర్‌ నిర్మాణం పూర్తయ్యాక దీనిని ఎంజీఆర్‌ చేతులమీదుగానే ప్రారంభింపచేయాలని భావించారు. ఆయన అనారోగ్యంతో ఉండటంతో 6 నెలల వరకు ఖాళీగానే ఉంచారు. ఈ విషయాలను స్మరించుకుంటూ గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు

  మరోచోట....

  కత్తి విడుదల రోజే విచారం చోటు చేసుకుంది. విజయ్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేస్తూ ఓ అభిమాని పై నుంచి పడిపోయి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం ఉన్ని కృష్ణన్‌(25) అనే యువకుడు వెల్డింగ్‌పని చేసుకుంటూ ఉంటాడు. కేరళ రాష్ట్రం వాడకెన్‌చరిలోని జయభారత్‌ థియేటర్‌లో విజయ్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేయడానికి పైకెక్కాడు.

  ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతను విజయ్‌ ఫాన్స్‌ అసోసియేషన్‌లో చురుకుగా పనిచేసేవాడని స్థానికులు తెలిపారు. కత్తి చిత్రం దీపావళి సందర్భంగా బుధవారం విడుదలైంది. అనేక సమస్యల మధ్య విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ని తెచ్చుకుంది.

  ఇక మురుగదాస్‌ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ మొమొరీ లాస్‌ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్‌', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్‌ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించారు. విజయ్‌, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుథ్‌ స్వరాలు అందించారు.

  తెలుగు వెర్షన్ కి వస్తే.... ఈ నెల 24న 'కత్తి' పాటల్ని విడుదల చేస్తారు. చిత్ర సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్‌ స్వరాలు అదనపు ఆకర్షణ. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

  English summary
  A sudden rush of fans at a screening of actor Vijay’s latest movie, Kaththi, at a small cinema hall on Periyapalayam Main Road in Thiruninravur on Deepavali day proved fatal for the hall owner. The 74-year-old died after he was pushed down in the melee.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X