twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే ఎన్నికల్లో ఓడిపోయాడు.. కమల్ హాసన్‌పై తీవ్రమైన ఆరోపణలు

    |

    రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు పాలిటిక్స్‌లోకి వచ్చిన విలక్షణ నటుడు కమల్ హాసన్‌పై సొంత పార్టీ వాళ్లే విరుచుకుపడుతున్నారు. గత నెల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో కమల్ స్థాపించిన మక్కల్ నీది మైయమ్ పార్టీ దారుణంగా ఓటమిపాలైవ్వడం రాజకీయ, సినివర్గాల్లో చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి కమల్ హాసన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కమల్ హాసన్‌పై ఓ నేత తీవ్ర ఆరోపణలు చేస్తూ...

    కీలక నేతలు పార్టీకి గుడ్‌బై

    కీలక నేతలు పార్టీకి గుడ్‌బై

    తమిళనాడు ఎన్నికల్లో మక్కల్ నీది మైయమ్ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలోని కీలక నేతల్లో ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్, ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు, ఇతర నేతలు పద్మప్రియ, ఏజీ మౌర్య, తంగవేల్, ఉమాదేవి, శేఖర్, సూర్య అయ్యర్ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

     నియంతృత్వ ధోరణితోనే

    నియంతృత్వ ధోరణితోనే

    కమల్ హాసన్ ఏకపక్ష ధోరణి, నియంతృత్వ ప్రవర్తన కారణంగానే ఎంఎన్‌ఎం పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీకి దూరమైన నేతలు విమర్శలు సంధిస్తున్నారు. పార్టీ నేతలను, కార్యకర్తలను విజయ్ టీవీ మాజీ ప్రొడ్యూసర్ తప్పుదోవ పట్టించారు. ఓటమికి అసలు కారణం ఆయనే అంటూ ఆరోపణలు చేశారు.

    మరో నేత పార్టీకి రాజీనామా

    మరో నేత పార్టీకి రాజీనామా

    ఇలాంటి ఆరోపణల మధ్య ఎంఎన్ఎం పార్టీ నుంచి మరో కీలక నేత సీకే కుమరావేల్ తప్పుకొన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతూ కమల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయిది. పార్టీని అభివృద్ధి చేయకపోగా వన్ మ్యాన్ పార్టీగా మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించారు అని కుమారవేల్ విమర్శలు చేశారు.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    దక్షిణ కోయంబత్తూరు సీటుపైనే

    దక్షిణ కోయంబత్తూరు సీటుపైనే

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయకపోగా, తన సొంత గెలుపు కోసమే స్వార్ధంగా వ్యవహరించారు. కేవలం దక్షిణ కోయంబత్తూరు సీటుపైనే దృష్టి పెట్టారు. తమిళనాడులో చరిత్ర సృష్టించాల్సిన పార్టీ గురించి కాకుండా.. పరాజయం పాలైన కమల్ చరిత్ర గురించి చదువుకోవాల్సి వచ్చింది అంటూ కుమారావేల్ విమర్శలు చేశారు.

    English summary
    Makkal Needhi Maiam leader CK Kumaravel shocking allegations Parties chief Kamal Haasan hits headlines of Tamil media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X