»   » మళ్ళీ ఫ్యాన్స్ వార్.... ఇంకో అభిమాని దారుణ హత్య

మళ్ళీ ఫ్యాన్స్ వార్.... ఇంకో అభిమాని దారుణ హత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక హీరో పై ఉన్న అభిమానం సాటి మనుషుల మీద ద్వేషంగా మారకూడదు. అభిమానం ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ అదే దురభిమానం అయితే మనిషి ని ఎంతకైనా దిగజారుస్తుంది. ఆ ఒక్క అభిమనినేనా. అతడు ఎవరి కోసమైతే అంతకు తెగబడ్డాడో ఆ హీరోకి కూడా చెడ్డ పేరే కదా. కొన్ని నేలల క్రితం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు పరస్పరం గొడవపడి. ఒక హీరో అభిఒమానినిఒ పొడిచి చంపిన విషయం మరువక ముందే. అక్లాంటి సంఘటనే మరొకటి తమిళనాడు లో జరిగింది.అయితే ఇక్కడ గొడవ పడ్డది ఒకే హీరోకి చెందిన రెండు వర్గాలు కావటం గమనార్హం...

సినీ అభిమాన సంఘం ఏర్పాటు విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నటుడు విక్రమ్‌ వీరాభిమాని దారుణహత్యకు గురయ్యాడు. నామక్కల్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. నామక్కల్‌ సమీపం దూసూరులోని ఇరవయ్యేళ్ళ యువకుడు మణికంఠన్ కబడ్డీ క్రీడాకారుడిగాను, తమిళ సినీ నటుడు విక్రమ్‌ వీరాభిమానిగాను ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నటుడు విక్రమ్‌ పేరిట అభిమాన సంఘం ఏర్పాటు చేసేందుకు మణికంఠన్, రామచంద్రన్ మధ్య చర్చలు జరిగాయి. ఆ సందర్భంగా మణికంఠన్ మాట్లాడుతూ తాను ఎన్నో యేళ్లుగా విక్రమ్‌ అభిమాన సంఘాన్ని నడుపుతున్నానని, కొత్తగా ఏర్పాటయ్యే సంఘానికి కూడా తాను అధ్యక్షుడిగా ఉంటానని చెప్పాడు.

Clash of fans: Hero Vikram fan killed in Tamilanadu

దీంతో ఆగ్రహించిన రామచంద్రన్, అతడి అనుచరులు మణి కంఠన్ పై దాడి జరిపారు. మణికంఠన్ అనుచరులు కూడా ప్రతిదాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో రామచంద్రన్ తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో మణికంఠన్ నరికాడు. ఈ దాడిలో మణికంఠన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతి చెందాడు. ఈ హత్యకు సంబంధించి రామచంద్రన్, కరుణామూర్తి, రాజేశ్, మణికంఠన్ అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

English summary
In a clash between the fans of Tamil Star Chiyan Vikram, a man was stabbed to death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu