»   » ‘రెమో’ పబ్లిసిటీ కోసం మన్మథ విగ్రహాలు

‘రెమో’ పబ్లిసిటీ కోసం మన్మథ విగ్రహాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: శివ కార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం 'రెమో' ఆడియో సెప్టెంబర్ 5న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 మన్మథ విగ్రహాలు

మన్మథ విగ్రహాలు

సినిమా పబ్లిసిటీలో భాగంగా చెన్నైలోని అన్ని థియేటర్ల వద్ద మన్మథ విగ్రహాలు ఏర్పాటు చేసారు.

 రొమాంటిక్

రొమాంటిక్

రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 పాటలు వచ్చేసాయి

పాటలు వచ్చేసాయి

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న ఆడియో రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో ఆల్బంలో మొత్తం 7 పాటలున్నాయి. ఆడియోకు మంచి స్పందన వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

 ప్రచార గీతం

ప్రచార గీతం

'సిరిక్కాదే' పేరుతో ఇటీవల ప్రమోషన్ సాంగ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆల్రెడీ రిలీజైన ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఆడియో రిలీజ్ సందర్భంగా 'సిరిక్కాదే' సాంగ్ ఇంగ్లిష్ వెర్షన్ ను 'కమ్ క్లోజర్' పేరుతో రిలీజ్ రిలీజ్ చేసారు.

 ఆర్.డి రాజా

ఆర్.డి రాజా

'రెమో' మూవీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలైన 24ఎఎం స్టూడియోస్ అధినేత ఆర్.డి రాజా ..... దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తో మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.

అక్టోబర్ 7న

అక్టోబర్ 7న

సినిమాను తమిళంలో అక్టోబర్ 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 అంచనాలు

అంచనాలు

సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కూడా భారీగానే చేస్తున్నారు

English summary
Remo Cupid Comes all over the city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu