Just In
- 32 min ago
మరో సినిమా కోసం అడ్వాన్స్ అందుకున్న వైష్ణవ్ తేజ్..?
- 58 min ago
ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత
- 1 hr ago
నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్
- 2 hrs ago
RRR కంటే భారీ బడ్జెట్: ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు!
Don't Miss!
- Automobiles
మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?
- Finance
సౌదీపై డ్రోన్ దాడి, డిమాండ్ ఎఫెక్ట్: చమురు ధరలు 100 డాలర్లకు చేరుకునే ఛాన్స్
- Sports
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక మారింది.. ఎక్కడంటే..?
- News
కమల్ హాసన్ థర్డ్ ఫ్రంట్ రెడీ... సీట్ల లెక్కలు కొలిక్కి... ఎవరెన్ని చోట్ల పోటీ చేస్తున్నారంటే...
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోజా భర్త సెల్వమణి సెన్సేషనల్ కామెంట్స్.. ఆ హీరో చేసిన తప్పు వల్లే ఈ పరిస్థితి అంటూ!
సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి దర్బార్ ఇష్యూపై స్పందించారు. ఈ మేరకు రజీనీకాంత్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దర్బార్ వివాదంలో డిస్ట్రిబ్యూటర్లు దర్శకుడు మురుగదాస్‌ను టార్గెట్ చేయడం సరికాదంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. ఇంతకీ సెల్వమణి చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

దర్బార్ మూవీ.. కలెక్షన్స్ డ్రాప్
మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజీనీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్ మూవీ ఆశించిన మేర వసూళ్లు రాబట్టలేక పోయింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ తొలుత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ క్రమంగా డీలాపడటంతో కలెక్షన్స్ ఓ రేంజ్‌లో డ్రాప్ అయ్యాయి.

తమిళనాడులో కూడా అదే పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన దర్బార్ మూవీ.. విడుదలయ్యాక కనీసం 100 కోట్లు షేర్ కూడా రాబట్టలేక పోయింది. తమిళనాడులో కూడా ఈ సినిమా ఏ మాత్రం వసూళ్లు తీసుకురాలేకపోయింది. దీంతో దర్బార్ సినిమా భారీ నష్టాలు కూడగట్టుకుంది.

రజినీ ఇంటికి వెళ్లాలని ప్లాన్.. చివరకు కోర్టుకు వెళ్లారు
దీంతో దర్బార్ సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లు రజినీకాంత్‌ను కలిసే ప్రయత్నం చేశారు. తాము తీవ్రంగా నష్టపోయామని, ఏదో ఓ మార్గం చూపించి తమను గట్టెక్కించాలని, లేదంటే తాము రోడ్డున పడాల్సి వస్తుందని వాళ్లు సూపర్ స్టార్‌కు చెప్పాలనుకున్నారు. ఈ మేరకు చెన్నైలోని రజినీ ఇంటికి వెళ్లాలని ప్రయత్నించగా అది విఫలమైంది. దర్శకుడు మురుగదాస్‌ను కలుద్దామని చూసినా ఇదే సీన్ రిపీట్ కావడంతో కోర్టుకు వెళ్ళారు బయ్యర్లు.

ముదిరిన దర్బార్ ఇష్యూ.. సెల్వమణి కామెంట్స్
దీంతో దర్బార్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఇటీవలే తమిళనాడు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన రోజా భర్త సెల్వమణి ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యాడు. దర్బార్ డిస్ట్రిబ్యూటర్లు.. ఇలా దర్శకుడు మురుగదాస్‌ను టార్గెట్ చేయడం తప్పు అని పేర్కొన్నాడు సెల్వమణి. హీరోలు, నిర్మాతలతో వివాదాలు ఉంటే టెక్నీషియన్లను టార్గెట్ చేయడం సరికాదని ఆయన తెలిపారు.

లాభాలు వస్తే హీరోలకు ఇస్తారా?
నిర్మాతల దగ్గరనుంచి సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు లాభనష్టాల పట్ల ముందే ప్రిపేర్ అయి ఉంటారని సెల్వమణి అన్నారు. ఒకవేళ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే వారికి వచ్చిన లాభాల్లో నుంచి హీరోలకు, దర్శకులకు ఏమైనా డబ్బులు ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

రజినీకాంత్ తప్పు వల్లే ఇదంతా.. సెల్వమణి హామీ
అయినా నష్టాలు వస్తే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి చెల్లించడం అనే ట్రెండ్ సెట్ చేసింది రజినీకాంతే అని, ఆయన చేసిన తప్పు వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని సెల్వమణి అన్నారు. ఈ మేరకు దర్శకుడు మురుగదాస్‌కు దర్శకుల సంఘం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.