For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తుపాకి కాలుస్తూ ... సినీ ఫైనాన్షియర్ వీరంగం

  By Srikanya
  |
  Film Financier
  చెన్నై : సినీ ఫైనాన్షియర్ తుపాకీతో కాల్పులకు దిగడంతో చుట్టు ప్రక్కల నివాసం ఉంటున్న స్థానికులు బెంబేలెత్తారు. ఈ సంఘటన చెన్నై కీల్‌పాక్ టైలర్స్ రోడ్డులో చోటుచేసుకుంది. అద్దె అడగినందుకు ఇలా గొడవకు దిగి వీరంగం సృష్టించాడు. కీల్‌పాక్ టైలర్స్ రోడ్డులో నాలుగు అంతస్తుల శబ్దమాలియా అపార్టుమెంట్ ఉంది. అందులోని మొద టి అంతస్తులో సినీ ఫైనాన్షియర్ విజయకర్ అద్దెకు ఉం టున్నారు.

  వేసవి సెలవులు కావడంతో భార్య, పిల్లలు విరుదునగర్ వెళ్లారు. ఇతను ఇంటి అద్దె, మెయింటినెన్స్ సక్రమంగా చెల్లించేవాడు కాదు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని గతంలో యజమాని పలుమార్లు అతనికి సూచించాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి కిందకు వచ్చిన విజయకర్‌ను మెయింటినెన్స్ కోసం అపార్టుమెంటు సంఘం అధ్యక్షుడు అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

  ఆగ్రహం చెందిన విజయకర్ వెంటనే ఇంటిలోని తన తుపాకీని తీసుకొచ్చి నేలపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనతో అపార్టుమెంట్ పరిసరాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ భవానీశ్వరి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు, కమాం డోలు అక్కడికి చేరుకున్నారు.

  ఇంతలో విజయకర్ తన ఇంటిలోకి వెళ్లి కిటికీ గుండా తుపాకీ చూపుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే కాల్చివేస్తాను లేదా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మద్యం బాటిళ్లను కిటికీల గుండా ప్రదర్శించాడు. తన భార్యకు ఫోన్ చేసి తనను పోలీసులు చుట్టుముట్టారని, తుపాకీతో కాల్చుకుని చచ్చిపోతున్నానని చెప్పాడు.

  దీంతో ఆందోళన చెందిన భార్య చెన్నై పోలీసులతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి 9 గంటల వరకు అతన్ని అదుపులోకి తీసుకోలేకపోయారు. దీంతో అతని భార్యను విమానంలో రప్పించే ప్రయత్నాలు చేశారు. కమాండోల సహాయంతో ఎలాగైనా విజయకర్‌ను పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. ఆ ఇంటి నుంచి కాపాడండి అంటూ ఒక యువతి కేకలు విని పించడంతో పోలీసులు వెనకడుగు వేశారు.

  తొందరపడితే ప్రాణహాని కలుగుతుందని భావించిన పోలీసులు మైక్‌ల ద్వారా సంభాషణలు ప్రారంభించారు. ఇంత లో విజయకర్ కిటికీ గుండానే మీడియాతో మాట్లాడడం ప్రారంభించాడు. దేశంలో ఐపీఎల్ బుకీల అరెస్ట్ లు జరుగుతున్నాయని, దానికి సంబంధించి తన వద్ద చాలా సమాచారం ఉందని పేర్కొన్నాడు.

  ఆ వివరాలు చెబుదామంటే పోలీసులు వచ్చారని తెలిపాడు. మీ ఇంటిలో ఉన్న యువతి ఎవరని మీడియా ప్రశ్నించగా, ఆమె తన వ్యక్తిగత కార్యదర్శి అని, ఆమెను ఏమీ చేయనని హామీ ఇచ్చాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న వ్యక్తిగత కార్యదర్శితో కలిసి కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. స్థానికులు ధైర్యం చేసి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

  English summary
  At the end of an 11-hour filmy style stand-off, city police struggled and finally apprehended a gun-toting film financier, who had locked himself in his apartment at Kilpauk and opened fire in the air several times on Wednesday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X