twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం' ఎఫెక్ట్ : విజయకాంత్‌పై పరువునష్టం దావా

    By Srikanya
    |

    చెన్నై : 'విశ్వరూపం' వివాదానికి సంబంధించి డీఎండీకే అధినేత విజయకాంత్‌పై ముఖ్యమంత్రి జయలలిత తరఫున పరువునష్టం దావా దాఖలైంది. ఆ చిత్ర విడుదలలో తలెత్తిన సమస్యలపై స్పందించి సందర్భంలో విజయకాంత్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జయలలితను విమర్శించినట్లు జనవరి 31న ఓ దినపత్రిలో వార్త ప్రచురితమైంది. విజయకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు కళంకం తెచ్చేలా ఉన్నాయంటూ చెన్నై సెషన్స్‌ కోర్టులో బుధవారం పరువునష్టం దావా దాఖలైంది. నగరానికి చెందిన సీనియర్‌ న్యాయవాది ఎమ్‌.ఎల్‌.జగన్‌ దీన్ని దాఖలు చేశారు. రిషివంద్యం నియోజవర్గంలో విజయకాంత్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం చెల్లదంటూ ఇదివరకే ఓ పిటిషన్‌ దాఖలైంది. న్యాయమూర్తి కె.వెంకటరామన్‌ ఎదుట బుధవారం ఇది విచారణకు వచ్చింది.

    దీనితో పాటు....ఇదే చిత్రానికి సంబంధించి తాజాగా యంగ్ హీరో విశాల్‌కు చిక్కులొచ్చాయి. విశ్వరూపం విషయంలో కమల్‌హాసన్‌కు సంఘీభావం ప్రకటించే ప్రయత్నంలో భాగంగా విశాల్‌ చేసిన వ్యాఖ్య వివాదానికి దారి తీసింది. 'కమల్‌హాసన్‌ ఇంతటి సమస్య ఎదుర్కొంటుంటే నటీనటుల సంఘం ఏం చేస్తోంది?' అంటూ విశాల్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన నటీనటుల సంఘం విశాల్‌ వ్యాఖ్య నటీనటుల సంఘాన్ని కించపరచటమే అన్న అభిప్రాయానికొచ్చింది. దీంతో సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన మిమ్మల్ని సంఘం నుంచి బహిష్కరిస్తే తప్పేంటి? అంటూ, విశాల్‌కు నోటీసులు జారీ చేసింది.

    విశ్వరూపం వ్యవహారంలో నడిగర్ సంఘం నటుడు విశాల్‌కు నోటీసులు పంపింది. విశ్వరూపం చిత్రంలో ముస్లింల మనోభావాలను భంగం కలిగించేలా సన్నివేశాలున్నాయంటూ ఆ సంఘాల ప్రతినిధులు చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆవేదన చెందిన కమల్‌హాసన్ దేశం వీడిపోతానని కంట తడి పెట్టారు. ఈ దృశ్యాలను టీవీలో చూసిన విశాల్ కమల్‌ను కలసి ఓదార్చారు. అనంతరం ఆయన కమల్ విషయంలో నడిగర్ సంఘం మద్దతు తెలపకుండా మౌనం వహించడానికి కారణమేమిటని ప్రశ్నించారు.

    సంఘం ప్రధాన కార్యదర్శి రాధారవి సోమవారం చెన్నైలో మాట్లాడుతూ.. కమల్‌హాసన్‌కు తమ సంఘం అండగానే నిలిచిందని, అధ్యక్షుడు శరత్‌కుమార్‌, రాధిక, శివకుమార్‌ తదితరులు కమల్‌ను కలుసుకుని మద్దతుగా నిలిచారని తెలిపారు. ఇవేవి తెలిసికోకుండా నోరు జారినందుకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని విశాల్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు.

    English summary
    
 The Govt of Tamil Nadu filed defamation case against Vijayakanth for his speeches on Viswaroopam issue
 Related
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X