Dhanush and Aishwaryaa divorce.. భార్యతో ధనుష్ విడాకులకు కారణం ఏమిటంటే?

తమిళ సినీ పరిశ్రమలో దిగ్గజ కుటుంబాలకు చెందిన జంట, సినీ నటుడు ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోవడం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. 18 ఏళ్లకుపైగా వైవాహిక జీవితంలో కలతలు రేగడంతో వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు జనవరి 18వ తేదీన వారిద్దరి తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా సంయుక్తంగా ప్రకటన చేశారు. దాంతో వారి అభిమానులు షాక్ గురవుతున్నారు. అయితే ధనుష్, ఐశ్వర్య రిలేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

ధనుష్, ఐశ్వర్య పరిచయం ఇలా..

ధనుష్, ఐశ్వర్య పరిచయం ఇలా..

ధనుష్, ఐశ్వర్య పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. ధనుష్ నటించిన కాదల్ కొండేన్ చిత్రం రిలీజ్ సమయంలో వారిద్దరూ కలుసుకొన్నారు. ఆ సినిమా నిర్మాత ధనుష్‌కు ఐశ్వర్యను పరిచయం చేశారు. ఆ తర్వాత ధనుష్ నటనను ప్రశంసిస్తూ ఐశ్వర్య ఓ లెటర్‌ను, బోకేను పంపించింది. అలా ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ సమయంలోనే వారిద్దరి గురించి మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి.

ఐశ్వర్యతో ధనుష్ ఆర్నెళ్లు డేటింగ్

ఐశ్వర్యతో ధనుష్ ఆర్నెళ్లు డేటింగ్


ఐశ్వర్య, ధనుష్ ఒకరినొకరు ఇష్టపడి ఇద్దరు డేటింగ్ ప్రారంభించారు. పబ్లిక్‌ కలుసుకోవడం, తిరగడంతో మీడియా కంటపడ్డారు. అయితే తమ మధ్య ఉన్న అఫైర్ వార్తల గురించి వారిద్దరు కొట్టిపడేశారు. ఓ దశలో నా సోదరి ఫ్రెండ్‌గా తప్ప.. మరే సంబంధం లేదు అని ధనుష్ క్లారిటీ ఇచచారు. అలా ఆరు నెలలు డేటింగ్ చేసిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. పెద్దలు కూడా ఒప్పుకోవడంతో వారిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది.

ధనుష్ కంటే వయసులో ఐశ్వర్య పెద్దగా

ధనుష్ కంటే వయసులో ఐశ్వర్య పెద్దగా

ధనుష్, ఐశ్వర్య ఆరు నెలలు ప్రేమించుకొని ఒకరినొకరు తెలుసుకొన్న తర్వాత 2014లో వివాహం చేసుకొన్నారు. అయితే వివాహం చేసుకొన్న సమయంలో ధనుష్‌కు 21 ఏళ్లు, ఐశ్వర్య రజనీకాంత్‌కు 23 ఏళ్లు. ధనుష్ కంటే రెండేళ్లు ఐశ్వర్య వయసులో పెద్ద అనే విషయం గమనార్హం. అయితే ఈ వయోభేదం వారి రిలేషన్‌కు అడ్డుకాలేదు.

18 ఏళ్ల కాపురం.. ఇద్దరు సంతానంతో

18 ఏళ్ల కాపురం.. ఇద్దరు సంతానంతో

ధనుష్, ఐశ్వర్య ఇద్దరు దాదాపు 18 ఏళ్లపాటు వైవాహిక జీవితాన్ని అనుభవించారు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. యాత్రకు 15 ఏళ్లు, కుమారుడు లింగకు 11 ఏళ్ల వయసు. ధనుష్‌కు తన పిల్లలంటే అంటే చెప్పలేనంత ఇష్టం. నా పిల్లల్ని స్నేహితులుగా చూస్తాను. నేను వారిని స్కూల్‌కు తీసుకెళ్తాను. మళ్లీ వారిని ఇంటికి తీసుకొస్తాను అని ధనుష్ చెప్పుకొచ్చారు.

ధనుష్ అక్రమ బంధాల కారణంగానే..

ధనుష్ అక్రమ బంధాల కారణంగానే..

అయితే ఇలా అన్యోన్యంగా ఉండే కుటుంబం విచ్ఛిన్నం కావడం వెనుక కారణం ధనుష్ అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. విడాకుల తీసుకోవడానికి ఐశ్వర్యను తప్పు పట్టాల్సిన పనేలేదు. ధనుష్‌ జీవితంలో ఉండే వివాదాలే విడాకులకు దారి తీశాయని అంటున్నారు. ధనుష్‌తో ఉన్న అఫైర్లను ఐశ్వర్య చాలా వరకు భరించింది. ఇక భరించలేని స్థితిలోనే వారిద్దరు విడిపోయారు అని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయ.

ధనుష్ విడాకుల ప్రకటన

ధనుష్ విడాకుల ప్రకటన

జనవరి 17వ తేదీనఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోతున్నట్టు ఇన్స్‌టాగ్రామ్‌లో ధనుష్ పోస్టు పెట్టారు. 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలు, తల్లిదండ్రులుగా, ఒకరికొకరం సన్నిహితులుగా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మా మధ్య సన్నిహిత సంబంధాలు, అవగాహన, సర్దుబాట్లు చోటు చేసుకొన్నాయి. కానీ మేము కలిసి జీవించలేమనే పాయింట్‌కు చేరుకొన్నాం. ఐశ్వర్య నేను భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాం. వ్యక్తిగతంగా ఒకరికొకరం సంపూర్ణంగా అర్దం చేసుకోనేందుకు సమయం తీసుకొంటున్నాం. మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, మా ప్రైవసీని అర్ధం చేసుకొంటారని అనుకొంటున్నాను. ఓ నమశ్శివాయ. ప్రేమతో అంటూ ధనుష్ అంటూ పోస్టు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X