Dhanush హైదరాబాద్‌లో ఒకే హోటల్‌లో ధనుష్, ఐశ్వర్య.. విడాకులు ప్రకటన తర్వాత అలాంటి ట్విస్టు!
దక్షిణ భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ సెలెబ్రిటీ దంపతులు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోవడం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. 18 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ దంపతులు విడిపోవడమేమిటనే ప్రశ్నలు ఉదయించాయి. ఇద్దరు పిల్లలు ఉన్న దంపతులు విడిపోవాలని, వైవాహిక జీవితానికి ముగింపు పలకడం ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే విడాకుల తర్వాత హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కలిసి ఉండటం మీడియా దృష్టిలో పడింది. ఆ వివరాల్లోకి వెళితే..

ధనుష్, ఐశ్వర్య సంయుక్తంగా
ఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోతున్నట్టు ఇన్స్‌టాగ్రామ్‌లో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ పోస్టు పెట్టారు. 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలు, తల్లిదండ్రులుగా, ఒకరికొకరం సన్నిహితులుగా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మా మధ్య సన్నిహిత సంబంధాలు, అవగాహన, సర్దుబాట్లు చోటు చేసుకొన్నాయి. కానీ మేము కలిసి జీవించలేమనే పాయింట్‌కు చేరుకొన్నాం. ఐశ్వర్య నేను భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాం. వ్యక్తిగతంగా ఒకరికొకరం సంపూర్ణంగా అర్దం చేసుకోనేందుకు సమయం తీసుకొంటున్నాం. మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, మా ప్రైవసీని అర్ధం చేసుకొంటారని అనుకొంటున్నాను. ఓ నమశ్శివాయ. ప్రేమతో అంటూ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ అంటూ పోస్టు పెట్టారు.

ఐశ్వర్యతో విడిపోవడంపై ధనుష్ తండ్రి
అయితే ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల ప్రకటనపై ఆయన తండ్రి కస్తూరి రాజా స్పందించారు. వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయనే విషయం నిజమే. కానీ ప్రతీ వైవాహిక జీవితంలో ఉంటే గొడవలే వారి మధ్య ఉన్నాయి. వారిద్దరూ విడాకులు తీసుకోలేదు. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. వారి పనుల కారణంగా హైదరాబాద్‌లో ఉన్నారు అని కస్తూరి రాజా వివరణ ఇచ్చారు.

రామోజీ ఫిలిం సిటీలో ఒకే హోటల్‌లో
అయితే ధనుష్, ఐశ్వర్య విడిపోయినట్టు ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలోని సితార హోటల్‌లో వేర్వేరు గదుల్లో బస చేశారు. ఇద్దరూ ప్రొఫెషనల్‌గా తమ తమ పనుల్లో భాగంగా హైదరాబాద్‌లో ఉన్నారు. మ్యూజిక్ వీడియోను రూపొందిస్తున్న ఐశ్వర్య రామోజీ ఫిలిం సిటీలో బిజీగా గడిపారు.

మ్యూజిక్ వీడియోకు ఐశ్వర్య దర్శకత్వం
ఐశ్వర్య రజనీకాంత్ విషయానికి వస్తే.. ఓ మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ షూటింగు పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ వీడియోను కుమార్ తరుణి నిర్మిస్తున్నారు అని బే ఫిల్మ్స్ తెలిపింది. సాంగ్ షూట్ ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఆమె టీమ్‌తో కలిసి మీటింగ్ జరిపారు. ఈ వీడియోను ప్రేమికు రోజు ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఓ ఫోటోను బే ఫిల్మ్స్ తమ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు.

సినిమా షూటింగ్ కోసం ధనుష్
ఇదిలా ఉండగా, ధనుష్ తన సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే చిత్రంలోను, అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాను చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇంకా ధనుష్ పలు తమిళ ప్రాజెక్టుల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











