తప్పుగా చూపిస్తే తల నరికేస్తాం.. ధనుష్‌కు వార్నింగ్.. చిక్కుల్లో చిత్రం
సినిమాలనేవీ వివాదాల్లో చిక్కుకోవడం ఈ మధ్య సర్వసాధారణమయ్యాయి. టైటిల్ తమ మనోభావాలను దెబ్బతీశాయని కొందరు, సినిమాలోని మాటలు కించపరిచేలా ఉన్నాయని మరికొందరు, పాటలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఇంకొందరు ఇలా ఏదో ఒక సాకు చూపిస్తూ.. సినిమాను వివాదాల్లోకి లాగుతుంటారు. తాజాగా ధనుష్ చేస్తున్న కర్ణన్ చిత్రానికి ఇలాంటి సమస్యలే వచ్చి పడ్డాయి.

ఫుల్ ఫామ్‌లో ఉన్న ధనుష్
అసురన్ చిత్రం భారీ హిట్టు కొట్టడంతో ధనుష్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ మధ్య వచ్చిన పటాస్ చిత్రం కూడా పర్వాలేదనిపించింది. ధనుష్ ప్రస్తుతం కర్ణన్, జగమే తంత్రం అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

చిక్కుల్లో కర్ణన్ చిత్రం..
మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న కర్ణన్ మూవీ టైటిల్ విషయమై శివాజీ గణేశన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమ హీరో టైటిల్‌ను ధనుష్ ఎలా వాడతాడంటూ.. ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణన్ చిత్రంలో కర్ణుడిగా శివాజీ గణేశన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వాస్తవ కథ ఆధారంగా..
1999లో జరిగిన కొడియాంగుళం, మణిమచ్చి జాతి ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని.. పులిప్పడై సామాజిక వర్గంను ఈ చిత్రం లో తప్పుగా చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమాలోని ఒక సీన్ లో పోలీస్ స్టేషన్‌ను ధనుష్ కాల్చి వేసే సన్నివేశం ఉంటుందని.. ఆ సన్నివేశంలో తమను టార్గెట్ చేశారనే ఫైర్ అవుతున్నారు.
Recommended Video


తలలు నరికేస్తా..
తాజాగా పులిప్పడై సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తమ సామాజిక వర్గం గురించి ఎలాంటి తప్పుడు సీన్స్ ఉన్నా కూడా తలలు నరికేస్తామంటూ హెచ్చరించాడు. అయితే వీటిపై చిత్రయూనిట్ ఇప్పటి వరకు స్పందించలేదు.


Click it and Unblock the Notifications











