For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీకి తెలుసు, పైసా అక్కర్లేదు.. ధనుష్‌ను పంపించండి చాలు: కన్నీటి పర్యంతమైన కదిరేశన్..

  |
  రజనీకి అంతా తెలుసు.. ధనుష్‌ మా కొడుకే !

  తమిళ హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ వాదిస్తున్న మేలూరు వృద్ధ దంపతులు.. ఆయన మామ, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. అభిమానులను ఉద్దేశించి రజనీ చెప్పిన నీతి సూత్రాలను తిరిగి ఆయనకే ఎక్కుపెట్టారు. తల్లిదండ్రుల గురించి అభిమానులకు రజనీ చేస్తున్న హితబోధ.. కాస్త ఆయన అల్లుడు ధనుష్ కు కూడా చేస్తే బాగుంటుందని అంటున్నారు.

  హీరో ధనుష్ మా కొడుకే.. సాక్ష్యాలతో కోర్టుకెక్కిన దంపతులు!

   రజనీ సందేశం..:

  రజనీ సందేశం..:

  రాజకీయం ఆరంగేట్రం నేపథ్యంలో రెండు రోజుల క్రితం రజనీకాంత్ అభిమానులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన అభిమానులు సమాజంలో మంచికి మారు పేరుగా ఉండాలని చెబుతూ ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు. 'నా అభిమానులు ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడాలి' అని పిలుపునిచ్చారు.

   అదే మాట ధనుష్‌కు చెప్పండి..:

  అదే మాట ధనుష్‌కు చెప్పండి..:

  రజనీ చేసిన ఈ వ్యాఖ్యలను ఒక్కసారి ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేలూరు వృద్ధ దంపతులు కోరుతున్నారు. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పిన రజనీ... ఇదే విషయాన్ని ధనుష్‌కు కూడా చెప్పాలని సూచించారు. ఈ మేరకు ధనుష్ తండ్రిని అని చెప్పుకుంటున్న కదిరేశన్.. రజనీకాంత్‌కు ఒక లేఖ రాయడం గమనార్హం.

   రజీనికి కూడా తెలుసు..:

  రజీనికి కూడా తెలుసు..:

  'ధనుష్ మా కుమారుడే అనే విషయం రజనీకాంత్ కు కూడా తెలుసు. అయినా స్పందించకపోవటం దారుణం' అని వారు వాపోతున్నారు. ధనుష్‌ తన కొడుకేనన్న విషయం ఆయన మామ, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కూడా బాగా తెలుసన్నారు. ఎలాగైనా ధనుష్ తమ వద్దకు వచ్చేలా రజనీ చర్యలు తీసుకోవాలని కోరారు.

   పైసా అక్కర్లేదు..:

  పైసా అక్కర్లేదు..:

  ప్రస్తుతం తన భార్య మీనాక్షి తీవ్ర అనారోగ్యంతో ఉందని, తమ కుమారుడు తమకు అండగా లేడన్న దిగులుతో తాము కుంగిపోతున్నామని కదిరేశన్ ఆవేదన వ్యక్తం చేశారు.

  ధనుష్‌ నుంచి తమకు ఒక్క పైసా అక్కర్లేదని.. తమను తల్లిదండ్రులుగా అంగీకరిస్తే అంతే చాలని ధీనంగా చెబుతున్నాడు. తాను రాస్తున్న ఈ లేఖను చూసైనా రజనీకాంత్‌ ధనుష్‌కు బుద్ధి చెప్పి తమ వద్దకు పంపాలని కదిరేశన్‌ కన్నీళ్లతో వేడుకున్నారు.

  న్యాయ పోరాటం:

  న్యాయ పోరాటం:

  1985 నవంబర్7న మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో ధనుష్ జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని గతంలో కదిరేశన్-మీనాక్షి దంపతులు కోర్టుకు తెలిపారు. ధనుష్ అసలు పేరు 'కాళీ సెల్వన్' అని.. 2002లో శివగంగై జిల్లాలోని అరుముగం కాలేజీలో చేర్చించగా.. నటనపై ఇష్టంతో అక్కడి నుంచి పారిపోయాడని కోర్టుకు తెలిపారు.

  కాదంటున్న ధనుష్:

  మరోవైపు ధనుష్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని, అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్ కే రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో అప్పట్లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

  ఎటూ తేలలేదు..:

  ఎటూ తేలలేదు..:

  ఈ వివాదం మద్రాస్ హైకోర్టులో ఉండగానే.. దీనిపై నటుడు ధనుష్ స్టే తెచ్చుకోవడం గమనార్హం. ధనుష్ డీఎన్ఏ టెస్టుకు ఒప్పుకోకపోవడం కూడా పలు సందేహాలకు తావిచ్చింది. అర్థరహితమైన కేసు కోసం తాను డీఎన్ఏ టెస్టుకు సిద్ధపడనని గతంలోనే ప్రకటించాడు. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు కదిరేశన్-మీనాక్షి దంపతుల పిటిషన్ కొట్టివేసింది. దీంతో ధనుష్ ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడ్డాడు.

  English summary
  Madurai-based elderly couple Kathiresan and Meenakshi, who have been waging a legal war claiming that actor Dhanush was their son, on Thursday said superstar Rajinikanth knowns fully well about the paternity of his son-in-law. In a letter to Rajini.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X