»   » రెండు రోజులు పాటు నీటి చుక్క ముట్టుకోలేదు

రెండు రోజులు పాటు నీటి చుక్క ముట్టుకోలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సిక్స్ ప్యాక్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ అందరూ హీరోలు తమ అభిమానులను అలరించటానికి ట్రై చేస్తున్న విషయం. అందుకోసం వారు కఠినమైన ఆహార నియమనిభంధనలు తో వ్యవహించాల్సి ఉంటుంది. తాజాగా తమిళ హీరో ధనుష్...సిక్స్ ప్యాక్ క్లబ్ లో జాయిన్ అయ్యారు. తన 25 వ చిత్రం Vellai Illa Pattdari లో తన అభిమానులకు ఆనందం కలగచేయటానికి ఆయన సిక్స్ ప్యాక్ తో కనిపించటానికి రెడీ అయ్యారు. అందుకోసం ఆయన రెండు రోజులు పాటు నీటి చుక్క కూడా ముట్టుకోలేదని తమిళ సిని పరిశ్రమ అంటోంది. మీరు నమ్మక పోయినా ఇది నిజం అని చెప్తోంది. మరి అంత కష్టపడి తయారు చేసిన సిక్స్ ప్యాక్ బాడీ ఎంతవరకూ ధనుష్ కి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

''నేను పరిశ్రమలో అడుగుపెట్టేటప్పుడు 'వీడు హీరోనా..' అని అంతా ఎగతాళి చేసారు. హిందీలోనూ అలాంటి మాటలే విన్నాను. అక్కడ కూడా నా సినిమా వూహించని స్థాయిలో విజయవంతమైంది. తప్పకుండా హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తా. అప్పుడూ ఇలాంటి మాటలు వినిపించొచ్చు. వాటిని నేను పట్టించుకోను. నేను నటించగలననే నమ్మకం ఉంది. దాంతోనే విజయాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను''అని ధనుష్ చెప్పాడు. ఆయన తనకు హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్న విషయం మీడియా ప్రస్తావిస్తే ఇలా స్పందించారు.

Dhanush without water for two days

ఇటీవల హాలీవుడ్‌లో నటించే అవకాశాలు వచ్చాయట ధనుష్‌కి. ప్రస్తుతం నటించలేనని చెప్పాడట. దీని గురించి ఆయన ముచ్చటిస్తూ.. ''హాలీవుడ్‌లో పలు అవకాశాలు వస్తున్నాయి. కథలను కూడా పంపుతున్నారు. ఇప్పట్లో కుదరదని చెప్పాను. పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నా. అయితే త్వరలో తప్పకుండా హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తా. నేను నటించగలననే నమ్మకం ఉంది. దాంతోనే సక్సెస్ ని సాథిస్తా''అని చెప్పాడు.

ఇక 'కొలవెరి..' పాటతో యువహీరో ధనుష్‌ స్టార్‌డం తారాస్థాయికి చేరుకుంది. హిందీ చిత్రసీమ ఎర్రతివాచీ పరిచింది. 'రాంజనా'తో బాలీవుడ్‌లోనూ విజయపతాకం ఎగురవేశాడు ధనుష్‌. దీంతో వరుసగా అక్కడ అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో ఇటీవల వచ్చిన 'నయ్యాండి' ఆశించిన స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం 'వేలయిల్లా పట్టదారి', 'అనేగన్‌'లో నటిస్తున్నాడు.


ఇక కెరీర్‌పరంగా తమ మధ్య ఉన్న పోటీని పక్కనపెట్టి సహ హీరోకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వటమో, పాట పాడటమో కుర్రహీరోలకు అలవాటైంది. తాజాగా ఇలయ తలబది విజయ్‌కు తన వంతు సహకారాన్ని ఇస్తున్నారు ధనుష్‌. విజయ్‌ ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో 'కత్తి'లో నటిస్తున్నారు. ఆయనకు జంటగా సమంత ఆడిపాడుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఇందులో విజయ్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. 'తుప్పాక్కి' వంటి హిట్‌ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

అనిరుధ్‌ స్వరకల్పనలో ఇప్పటికే నాలుగు పాటలు కంపోజ్‌ కూడా అయిపోయాయి. మరో పాటను విజయ్‌తో పాడించాలని నిర్ణయించారట అనిరుధ్‌. ఈ పాటను రాసేందుకు ధనుష్‌ ముందుకొచ్చారట. విజయ్‌ ఇమేజ్‌కు తగిన విధంగా ఆ పాటను రచించే పనిలో బిజీగా ఉన్నారట ధనుష్‌. విజయ్‌ కూడా ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

English summary
Dhanush is showing his six pack much to the delight of his fans in his 25 film Vellai Illa Pattdari. He followed special diet and in a scene showing his six pack and performing stunts he spent two days without having even water. He said though it is unbelievable it is true.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu