»   » టైం చూసి కాజల్ కొట్టింది..అంతే

టైం చూసి కాజల్ కొట్టింది..అంతే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : హాట్ బ్యూటీ కాజల్ తో పని చేసిన వారంతా ఆమె చాలా తెలివైందని చెప్తూంటారు. కేవలం నటన మాత్రమే కాక అన్ని విషయాల్లోనూ ఆమె ఆచి తూచి అడుగులు వేస్తుందని, అందుకునే ఇండస్ట్రీకి వచ్చే ఇంతకాలమైనా ఇంకా కొనసాగుతుందని చెప్తూంటారు. అందుకు ఉదాహరణగా..రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన చెప్తున్నారు.

కాజల్, విజయ్ కాంబినేషన్ లో గతంలో తుపాకి, జిల్లా చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. దాంతో నిర్మాతలు మళ్లీ విజయ్ సరసన ఆమెను తీసుకుంటే సెంటిమెంట్ గానూ,బిజినెస్ పరంగానూ హిట్ కొట్టవచ్చు అని భావించారు. ఈ విషయం తెలిసుకున్న కాజల్...మొదట ఈ ప్రాజెక్టుకు ఓకే అని లాస్ట్ మినిట్ లో తన రెమ్యునేషన్ రెండున్నర కోట్లు అని చెప్పిందిట.

దాంతో అప్పటికే విజయ్ తో ఆమె ను తీసుకుంటున్నామని చెప్పటంతో ఆమెకి ఈ ఎమౌంట్ ఇవ్వటం తప్పటం లేదుట. ఇలా టైం చూసి నిర్మాతల నాడిపై కొట్టిందంటున్నారు తమిళ తంబీలు. అయినా తనను బుక్ చేస్తే తెలుగులోనూ తన మార్కెట్ ని చక్కగా క్యాష్ చేసుకోవచ్చనే విషయం చెప్తోందట.

Did Kajal demand Rs 2.5 crore?

షూటింగ్ దశలో ఉన్న విజయ్‌ తాజా చిత్రం ‘తెరి'. అట్లి దర్శకత్వంలోని ఈ చిత్రం షూటింగ్ పనులు దాదాపుగా ముగిశాయి. దీంతో తర్వాతి చిత్రానికి విజయ్‌ సిద్ధమయ్యారు. భరతన్‌ దర్శకత్వంలో ఆయన నటించనున్న తర్వాతి చిత్రాన్ని విజయ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనుంది. ఇది విజయ్‌కు 60వ చిత్రం.

దీని పూజా కార్యక్రమం విజయ ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగింది. ఇందులో నిర్మాత భారతిరెడ్డి, దర్శకుడు భరతన్‌, సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు. చిత్రానికి సినిమాటోగ్రాఫ్‌-మది, ఎడిటింగ్‌-ప్రవీణ్‌. ఇందులో విజయ్‌కు జంటగా కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేయనున్నట్లు కోలీవుడ్‌ సమాచారం.

English summary
Kajal quoted a pay package of Rs 2.5 crore for playing the female lead in Tamil star Vijay's 60th Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu