»   » వరద భాధితులకు ...దర్శకుడు శంకర్‌ విరాళం

వరద భాధితులకు ...దర్శకుడు శంకర్‌ విరాళం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళనాడులో వరద బాధితుల సహాయార్థం దర్శకుడు శంకర్‌ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. హీరోయిన్స్ హన్సిక రూ. 15 లక్షలు విరాళమిచ్చారు. తెలుగు నటీనటులు కూడా తమవంతుగా విరాళాలు సేకరిస్తున్నారు.

అలాగే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. ఎడతెగకుండా తమిళనాడులో కురుస్తున్న వర్షా లతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సీఎం సహాయనిధికి రజనీ రూ.10 కోట్ల పది లక్షలు అందజేశారు.

Director Shankar donated 10 lakhs to Chennai Flood Victims

సౌత్ లో పెద్ద హీరోలైన అల్లు అర్జున్ 25 లక్షలు, సూర్య, కార్తి కలిపి రూ. 25 లక్షలు, జూ ఎన్టీఆర్, మహేష్ బాబు చెరో 10 లక్షలు విరాళం విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఏ మాత్రం తీసిపోకుండా చిన్న సినిమాల హీరోయిన్ శ్రీదివ్య కూడా విరాళం అందించడం విశేషం.

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన చెన్నై నగరం, తమిళనాడులోని ఇతర ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ విపత్తుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చెన్నై నగరంలోని కొన్ని పరిస్థితులు మునుపటి స్థితికి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని అంటున్నారు.

English summary
Director Shankar has donated Rupees 10 Lakhs for flood relief to CM’s Relief Fund through RTGS
Please Wait while comments are loading...