»   » 400 కోట్లతో సంఘమిత్ర.. షూటింగ్ డేట్ కన్ఫర్మ్..

400 కోట్లతో సంఘమిత్ర.. షూటింగ్ డేట్ కన్ఫర్మ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి స్ఫూర్తితో దక్షిణాదిలో భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకొన్నది. ఇప్పటికే భారీ బడ్జెట్‌తోపాటు, అత్యాధునిక సాంకేతికతో రోబో2 చిత్రం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్నది. ఒకవైపు రోబో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధవుతుండగా, మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్దమవుతున్నది. తమిళ చిత్ర పరిశ్రమలో కనివిని ఎరుగని విధంగా సంఘమిత్ర చిత్రాన్ని రూ.400 కోట్లతో తెరకెక్కించనున్నారు.

సంఘమిత్ర చిత్రాన్ని తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో దర్శకుడు సుందర్ సీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత శృతిహాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కొన్ని కారణాల వల్ల శృతి సినిమాను అర్ధాంతరంగా తప్పుకొన్నారు. ఆ తర్వాత శృతీ స్థానంలో బాలీవుడ్ నటి దిశా పటానిని ప్రాజెక్ట్‌లోకి తీసుకొన్నారు.

Disha Patanis Sangamithra to go on floors in July 2018

సంఘమిత్ర మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో జూలై నుంచి ప్రారంభం కానున్నదనేది తాజా సమాచారం. ఈ చిత్రం కోసం రామోజీ స్టూడియోలో భారీ సెట్స్‌ను వేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

English summary
Director Sundar C's upcoming historical saga, Sangamithra getting ready for Shoot. After Shruti Haasan opted out of the project, Bollywood actress Disha Patani was roped in to play the role of a warrior princess. As per reports, Sangamithra to go on floors in July 2018. For this project, sets are getting ready in Ramoji film city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X