For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'లింగ' ఆందోళనపై...హైకోర్టు ఆదేశం

  By Srikanya
  |

  చెన్నై: రజనీకాంత్ 'లింగ' చిత్రానికి సంబంధించి మెరీనా పిక్చర్స్‌ అనే సంస్థ ప్రతినిధి ఆర్‌.సింగారవడివేలన్‌ మద్రాసు హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో.. సూపర్‌స్టార్‌ నటించిన 'లింగ' చిత్రాన్ని తిరుచ్చి, తంజావూరు ప్రాంతాల్లో విడుదల చేసే హక్కులను తాము సొంతం చేసుకున్నానని తెలిపారు.

  సినిమా భారీ స్థాయిలో విజయం చెందుతుందని సంబంధిత వర్గాలు చెప్పడంతో సినిమాను థియేటర్‌ యాజమానులకు దాదాపు రూ. 8 కోట్ల వరకు విక్రయించామని పేర్కొన్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత అనుకున్న స్థాయికన్నా తక్కువగానే వసూలు చేసిందని అన్నారు. థియేటర్‌ యజమానులు తమ నగదును తిరిగి ఇచ్చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని ప్రస్తావించారు.

  పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

  Distributor of 'Lingaa' claims loss, moves HC to hold hunger protest

  దీంతో చిత్ర నిర్మాణ సంస్థను, సంబంధిత వర్గాలతో తమ గోడును వెల్లడించామని, అయితే ఇప్పటి వరకు వారు స్పందించలేదని తెలిపారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చెన్నైలోని, వళ్లువర్‌కోట్టం లేదా అతిథిగృహం సమీపంలో ఆందోళన చేసేందుకు అనుమతి కోరుతూ కమిషనర్‌ గత మూడోతేదీన వినతిపత్రాన్ని సమర్పించేందుకు వెళ్లామని అన్నారు.

  అయితే కమిషనర్‌ తమ వినతిపత్రాన్ని తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. రానున్న 10వతేదీన తాము ఆందోళన చేసుకునేందుకు అనుమతిని ఇచ్చేలా కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటీషన్‌ న్యాయమూర్తి జస్టీస్‌ శివజ్ఞానం ఎదుట విచారణకు వచ్చింది. ఈ విషయమై కమిషనర్‌ బుధవారం సమాధానమివ్వాలని ఆదేశించారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

  చిత్రం కథేమిటంటే...

  Distributor of 'Lingaa' claims loss, moves HC to hold hunger protest

  లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు.

  అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు. అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు.

  Distributor of 'Lingaa' claims loss, moves HC to hold hunger protest

  ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

  సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా చేసారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

  English summary
  Complaining of huge losses, distributors of superstar Rajinikanth's recently released film 'Lingaa' in Trichy and Thanjavur region, have approached Madras high court for permission to stage hunger strike in Chennai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X