twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోడీ ఎఫెక్ట్ : ఆ స్టార్ హీరో హోర్డింగులకు ముసుగు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కొన్ని రాజకీయ పక్షాలతో హీరో విజయ్‌కు విబేధాలు ఉన్న నేపథ్యంలో ఆయన మోడీని కలవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    మోడీకి మద్దతు ఇవ్వడం వల్ల విజయ్‌కి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న విజయ్ ఫోటోలతో కూడిన పోస్టర్లు తొలగించాలని, వ్యాపార ప్రకటనలకు సంబందించిన హోర్డింగులపై ముసుగులు వేయాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది.

    EC eye on Tamil actor Vijay hoardings

    నిన్నమొన్నటి వరకు విజయ్‌కి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేక పోవడంతో ఎన్నికల సంఘం ఆయనకు సంబంధించిన హోర్డింగులపై దృష్టిసారించలేదు. అయితే ఆయన ఇటీవల మోడీని కలిసి తన మద్దతు ప్రకటించడంతో ఆయన అభిమానులు కూడా బిజేపీకి జిందాబాదులు కొడుతున్నారు.

    ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఆయన హోర్డింగులుక ముసుగులు వేయాలని నిర్ణయించింది. విజయ్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హోర్డింగులకు ముసుగులు వేయడంతో సదరు సంస్థలు షాక్ తిన్నాయి.

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అన్నాడిఎంకెకు తన మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిణ పరిణామాలతో విజయ్ ఆ పార్టీకి దూరం అయ్యాడు. ఇపుడు బిజేపీకి తన మద్దతు ప్రకటించారు. రేపు మోడీ ప్రధాని అయితే తమిళనాడులో తనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పక్షాలను ఎదుర్కోవడం సులభమవుతుందని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Meeting BJP Prime Ministerial candidate Narendra Modi, has not augured well for Tamil superstar Vijay. After he met Modi recently in Coimbatore, Vijay found all the hoardings featuring him being covered at the order of Election commission.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X