హీరోలపై బుతులతో రెచ్చిపోయిన హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన ఫ్యాన్స్.. చెప్పులతో కొట్టి..

తమిళనాడులో అభిమానం అనే డోస్ అంతకు మించి అనేలా ఉంటుంది. వెండితెర హీరోలను అక్కడి ప్రజలు దాదాపు దైవం అనేలా ప్రేమిస్తారు. వారి హీరోపై ఎవరైనా కామేంట్స్ చేస్తే మాత్రం రోడ్డెక్కి రచ్చ చేస్తారనే వార్తలు రోజు వస్తూనే ఉంటాయి. ఇక ఇటీవల ఒక హీరోయిన్ స్టార్ హీరోల అభిమానులకు పట్టారని కోపం తెప్పిస్తోంది. చూస్తుంటే వివాదం డోస్ కూడా రోజురోజుకి మరింత ఎక్కువవుతోంది. ఆమె మరెవరో కాదు.. కోలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ మీరా మిథున్.

Recommended Video

Allu Arjun Wife Sneha Reddy Created A New Record
బండ బుతులతో రెచ్చిపోతూ..

బండ బుతులతో రెచ్చిపోతూ..


ఇటీవల కాలంలో మీరా మిథున్ చేస్తున్న కాంట్రవర్సీ కామెంట్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోలపై ఆమె బండ బుతులతో రెచ్చిపోతున్న విధానం అందరిని షాక్ కి గురి చేస్తోంది. మొన్నటివరకు త్రిషను టార్గెట్ చేసిన మీరా సడన్ గా విజయ్, సూర్యల పర్సనల్ విషయాలపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తోంది.

బెదిరింపు కాల్స్..

బెదిరింపు కాల్స్..

ఇప్పటికే సోషల్ మీడియాలో అమ్మడు భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. బెదిరింపు కాల్స్ కూడా మొదలైనట్లు ఆమెనే సోషల్ మీడియా ద్వారా పలు స్క్రీన్ షాట్స్ ని బయటపెట్టేసింది. అయినప్పటికీ మీరా తగ్గకపోవడంతో అభిమానుల ఆగ్రహం కూడా కొంచెం కొంచెంగా కట్టలు తెచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు కూడా ఆమెకు ఇన్ డైరెక్ట్ కౌంటర్స్ ఇస్తున్నారు.

చెప్పులతో కొట్టి మంట పెట్టారు

చెప్పులతో కొట్టి మంట పెట్టారు

రీసెంట్ గా సూర్య, విజయ్ అభిమానులు మీరా మిథున్ కామెంట్స్ కి రోడ్డెక్కారు. కలామ్ అనే ఆర్గనైజేషన్ తో కలిసి ఆమె ఫోటోతో ఉన్న దిష్టి బొమ్మను ఊరేగించారు. చెప్పులతో కొట్టి మంట పెట్టారు. దిష్టి బొమ్మను దగ్ధం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఇక తమిళ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో టెలిక్యాస్ట్ అవ్వడంతో మీరా చాలా సీరియస్ అయ్యింది.

ఆయన పేరును వాడుకునే అర్హత మీకు లేదు

ఆయన పేరును వాడుకునే అర్హత మీకు లేదు

ఈ ఘటనపై స్పందించిన మీరా మిథున్ కనీసం మీ సంఘం పేరును మార్చుకోండి. కలామ్ జి అనే పేరుకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. ఇలా చేస్తే ఆయన పేరును వాడుకునే అర్హత కూడా మీకు లేదని విజయ్, సూర్యలపై మీరా మండిపడ్డారు. అలాగే వీడియోను ప్రసారం చేసిన ప్రముఖ న్యూల్ ఛానెల్ ని కూడా తప్పుబట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X