హీరోగా మారుతున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్
సౌతిండియా స్టార్ డైరెక్టర్లలో ఒకరైన గౌతమ్ మీనన్ త్వరలో హీరోగా అవతారం ఎత్తబోతున్నాడు. హీరోగా అంటే రొమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లు ఉండక పోవచ్చు కానీ... ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతోంది.
జై అనే కొత్త దర్శకుడు ఓ స్క్రిప్టుతో ఇటీవల గౌతమ్ మీనన్‌ను సంప్రదించాడని, కథ నచ్చడంతో ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడానికి ఓకే చెప్పాడని సమాచారం. ఈ చిత్రంలో ఇవానా అనే ఓ అమ్మాయి ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'ఎనై నూకి పాయుమ్ తోట'. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
దీంతో పాటు విక్రమ్ ప్రధాన పాత్రలో 'ధృవ నక్షత్రం' అనే మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











