»   » రూమర్లలో వాస్తవం లేదు.. నా కూతురు గురించి అలా రాయొద్దు.. గౌతమి క్లారిటీ..

రూమర్లలో వాస్తవం లేదు.. నా కూతురు గురించి అలా రాయొద్దు.. గౌతమి క్లారిటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కూతురు సుబ్బలక్ష్మిపై వస్తున్న రూమర్లపై సీనియర్ నటి గౌతమి వివరణ ఇచ్చింది. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌లో సుబ్బలక్ష్మి నటిస్తున్నారనే వార్తలను గౌతమి కొట్టిపారేసింది. తమిళ రీమేక్‌లో హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ అర్జున్‌రెడ్డిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండురోజులుగా సుబ్బలక్ష్మీ ఎంట్రీపై మీడియాలో కథనాలు ప్రముఖంగా వినిపిస్తుండటంతో ఆమె స్పందించాల్సి వచ్చింది.

సుబ్బలక్ష్మి సినీ ప్రవేశంపై

సుబ్బలక్ష్మి సినీ ప్రవేశంపై

తన కూతురు సినీ రంగ ప్రవేశంపై గౌతమి ట్విట్టర్‌లో స్పందించారు. సుబ్బలక్ష్మి సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన వార్త రావడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అయితే సుబ్బలక్ష్మి గురించి మీడియా ఆ విధంగా స్పందించడం మంచిదే అని అన్నారు.

రొమాన్స్ కాస్త ఘాటుగానే....!
 చదువులపైనే దృష్టి

చదువులపైనే దృష్టి

ప్రస్తుతం సుబ్బలక్ష్మి దృష్టంతా చదువులపైనే ఉంది. ఇప్పుడే యాక్టింగ్‌లోకి ప్రవేశించడం సాధ్యపడదు. ఆమెకు కూడా ఇష్టం లేదు అని గౌతమి ట్విట్టర్‌లో పేర్కొన్నది. సుబ్బలక్ష్మి కాదని గౌతమి వివరణ ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ హీరోయిన్ ఎంపిక ప్రశ్నగానే మిగిలింది.

హీరోయిన్ ఎవరు?

హీరోయిన్ ఎవరు?

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. హీరోయిన్ ఎంపికపై యూనిట్ కసరత్తు చేస్తున్నది.

సుబ్బలక్ష్మి వార్త నిజమేనని..

సుబ్బలక్ష్మి వార్త నిజమేనని..

హీరోయిన్ కసరత్తు ప్రక్రియలోనే తమిళ మీడియాలో సుబ్బలక్ష్మి పేరు వినిపించింది. తెలుగులో షాలిని పాండే పోషించిన పాత్రను ఆమె పోషిస్తున్నారంటూ కథనాల్లో పేర్కొన్నారు. దాంతో అంతా నిజమే అనే భ్రాంతిలో పడిపోయారు. మీడియా కథనాలు జోరందుకోవడంతో గౌతమి రంగంలోకి దిగారు.

తొలి షెడ్యూల్ పూర్తి

తొలి షెడ్యూల్ పూర్తి

తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరును వర్మగా ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ షూట్‌ను ఇటీవల నేపాల్‌లోని కట్మాండులో పూర్తి చేశారు. ఈ సంవత్సరం చివర్లో వర్మ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
Telugu hit film Arjun Reddy is being remade into Tamil. The film is titled Varma but what makes this film extra special is that, it will mark the debut of Chiyaan Vikram’s son – Dhruv. As per reports Subbalakshmi, Gautami‘s daughter had been roped in for the female lead role of Varma. There was no official confirmation on the same. However, Gautami has now taken to social media to put all speculation to rest.. Taken aback to see news about my daughter’s acting debut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu