»   » 'కడలి' ఫేం గౌతంకార్తీక్‌ నెక్ట్స్ రిలీజ్ కు రెడీ

'కడలి' ఫేం గౌతంకార్తీక్‌ నెక్ట్స్ రిలీజ్ కు రెడీ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : మణిరత్నం 'కడలి‌' ఫేం గౌతంకార్తీక్‌ గుర్తుండే ఉంటారు. ఇప్పుడతను తన తదుపరి చిత్రం విడుదలకు సిద్దమవుతున్నాడు. తెలుగులో ఘన విజయం సాధించిన చిత్రం 'అలా మొదలైంది'. ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో 'ఎన్నమో ఏదో'గా రీమేక్‌ అవుతోంది. గౌతం ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రకుల్‌ప్రీతి, నికిషాపటేల్‌ కూడా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. స్టంట్‌మాస్టర్‌ త్యాగరాజన్‌ కుమారుడు రవి దర్శకత్వం వహిస్తున్నాడు. సంగీతం డి.ఇమాన్‌. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది. గౌతం తండ్రి, నటుడు కార్తీక్‌ ముఖ్య అతిథిగా ఆడియోను ఆవిష్కరించారు.

  Gautham Karthik at Ennamo Yedho Audio Launch

  కార్తీక్‌ మాట్లాడుతూ.. '' సినిమా శీర్షిక చూసి ఏంటోననుకున్నా. తర్వాత సినిమాను చూశా. మంచి కథ ఉన్న చిత్రమిది. తెలుగులో హిట్‌ అయిన 'అలా మొదలైంది'కి రీమేక్‌. డి.ఇమాన్‌ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాతో గౌతం మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందరికీ గౌతం ప్రత్యేకత తెలుస్తుంది. చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను''అని తెలిపారు. ఈ సినిమా విడుదల కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని గౌతం చెప్పారు.

  గౌతం కార్తీక్ తొలి చిత్రం 'కడలి' ప్లాపయినప్పటికీ ఆయన పెర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం గౌతం కార్తీక్ రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక నికీషా పటేల్ విషయానికొస్తే....2010లో'పులి' చిత్రం ద్వార హీరోయిన్ గా పరిచయం అయిన నికీషా ఆ చిత్రం ప్లాపు కావడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు ఒక్క ఛాన్స్ దక్కలేదు. 2012లో మూడు కన్నడ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న 'రమ్' చిత్రంలో నటిస్తోంది.

  English summary
  Gautham Karthik's upcoming film "Yennamo Yedho" audio released. "Yennamo Yedho" is a romantic comedy entertainer, directed by Ravi Thyagarajan. It is a remake of Telugu film "Ala Modalaindi", which released in 2011 and turned out to be a big hit. The Tami version will have Gautham Karthik, Rakul Preet Singh and Nikeesha Patel in lead roles, while actor Prabhu will appear in a pivotal role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more