twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్బాయిలపై కూడా లైంగిక వేధింపులు.. ఇక వాళ్లే దిక్కు అంటున్న సీనియర్ హీరోయిన్!

    |

    సీనియర్ హీరోయిన్ గౌతమి వివిధ సామజిక కార్యక్రమాలతో తరచుగా వార్తల్లో ఉంటారు. అన్ని అంశాలపై ఆమె అతనా అభిప్రాయాలని పంచుకుంటారు. కొన్నేళ్ల పాటు గౌతమి, లోకనాయకుడు కమల్ హాసన్ తో సహజీవనంలో ఉన్న సంగతి తెలిసిందే. 2016లో గౌతమి, కమల్ హాసన్ విడిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా గౌతమి చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులు, సంచలనాలు సృష్టిస్తున్న మీటూ ఉద్యమం గురించి గౌతమి స్పందించారు.

    క్యాన్సర్ బారీన పడి

    క్యాన్సర్ బారీన పడి

    చిత్ర పరిశ్రమలో తరచుగా కొంత మంది నటులు క్యాన్సర్ కు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. గౌతమి కూడా గతంలో క్యాన్సర్ కు గురై ఆ తరువాత కోలుకున్నారు. అందుకే గౌతమి ఎక్కువగా క్యాన్సర్ పై అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పెరంబూరులో జరిగిన క్యాన్సర్ అవగాహన సదస్సుకు గౌతమి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    నా జీవితంలో గౌతమి అనే మహిళే లేదు.. శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు, అతడు స్నేహితుడు మాత్రమే! నా జీవితంలో గౌతమి అనే మహిళే లేదు.. శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు, అతడు స్నేహితుడు మాత్రమే!

    పూర్తిగా మారిపోయింది

    పూర్తిగా మారిపోయింది


    క్యాన్సర్ చికిత్స తరువాత నా శరీరం పూర్తిగా మారిపోయింది. శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి యోగా నాకు బాగా ఉపయోగపడిందని గౌతమి అన్నారు. క్యాన్సర్ వ్యాధిని దాచిపెట్టడం, నిర్లక్యం చేయడం చాలా ప్రమాదకరం అని గౌతమి తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గౌతమి సూచించారు.

    అమ్మాయిలకే కాదు

    అమ్మాయిలకే కాదు

    చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపులు, మీటూ ఉద్యమం గురించి గౌతమికి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో ఉన్నాయి. కేవలం మహిళలపైనే కాదు మగవారిపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని గౌతమి అన్నారు. చిన్న పిల్లలని కూడా వేధిస్తున్నారని తెలిపారు.

    వారిదే భాద్యత

    వారిదే భాద్యత

    అన్ని రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులకు భాద్యత తీసుకుని రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వమే అని అన్నారు. చిత్రపరిశ్రమలో ఉన్న అధికారిక సంఘాలు కూడా ఇలాంటి పనుల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. తమిళ నిర్మాతల మండలిలో విశాల్ కేంద్రంగా చెలరేగుతున్న వివాదం గురించి మాట్లాడుతూ.. ఆ సమస్యని అంతా కలసి చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు.

    English summary
    Gauthami sensational comments on harassment in industry. She also responds on Vishal issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X