»   » ‘మహానటి’లో మా నాన్నను తప్పుగా చూపించారు: జెమినీ గణేశన్ కూతురు ఫైర్!

‘మహానటి’లో మా నాన్నను తప్పుగా చూపించారు: జెమినీ గణేశన్ కూతురు ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahanati Movie Get Opposed From Gemini Ganesan Daughter

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాపై తెలుగునాట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమా చిత్రీకరించిన తీరుపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. సావిత్రి పిల్లలు విజయ ఛాముండేశ్వరి, సతీష్ సైతం ఈ సినిమాపై పూర్తి సంతృప్తిగా ఉన్నారు. అమ్మ గురించి నిజాలు చూపించారని సంతోషం వ్యక్తం చేశారు. అయితే తొలిసారిగా ఈ సినిమాపై వ్యతిరేక గళం వినిపించింది. జెమినీ గణేశన్ మొదటి భార్య కూతురు, వైద్యురాలు కమలా సెల్వరాజ్‌ సినిమాలో తన తండ్రిని చిత్రీకరించిన తీరుపై మండి పడ్డారు.

తన తండ్రిని చిత్రీకరించిన తీరు దారుణం

తన తండ్రిని చిత్రీకరించిన తీరు దారుణం

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌లతో పాటు తన తండ్రి జెమినీగణేశన్‌ అగ్రహీరోగా వెలుగొందారని, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతుల ఉన్న ఆయన్ను ఈ చిత్రంలో కించ పరిచే విధంగా చూపించారని కమలా సెల్వరాజ్ ఆరోపించారు.

లేజీ పర్సన్‌లా చూపారు

లేజీ పర్సన్‌లా చూపారు

తన తండ్రిని ఒక లేజీ పర్సన్ మాదిరిగా చూపించారని, తన స్థాయికి తగిన వ్యక్తిగా చూపించలేదని, సినిమా అవకాశాలు లేని వ్యక్తిలా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కమలా సెల్వరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సావిత్రి వాచ్‌మెన్‌తో బయటకు గెంటించింది

సావిత్రి వాచ్‌మెన్‌తో బయటకు గెంటించింది

‘ప్రాప్తం' సినిమా సమయంలో సావిత్రిని కలిసి నిర్ణయం మార్చుకోవాలని చెప్పేందుకు ఆమె ఇంటికి నాన్న వెళ్లాడని, ఆ సమయంలో తాను కూడా నాన్నతో ఉన్నానని... వాచ్‌మెన్‌ చేత సావిత్రి తమను బయటకు గెటించి అవమానించిందని, అప్పటి నుండి తాము సావిత్రి గడప తొక్కలేదని కమలా సెల్వరాజ్ తెలిపారు.

నాన్నే మందు అలవాటు చేయించినట్లు చూపించారు

నాన్నే మందు అలవాటు చేయించినట్లు చూపించారు

సావిత్రికి మద్యం అలవాటు చేసింది మా నాన్నే అన్నట్లు చిత్రీకరించడం తనను ఎంతగానో బాధించిందని, ఇది వాస్తవం కాదని కమలా సెల్వరాజ్ చెప్పే ప్రయత్నం చేశారు.

మా అమ్మ మీద ప్రేమ లేనట్లు చూపారు

మా అమ్మ మీద ప్రేమ లేనట్లు చూపారు

నాన్నకు తొలిసారిగా ప్రేమ కలిగింది సావిత్రి పైనే అనేలా సినిమాలో చిత్రీకరించారు. సావిత్రి కంటే ముందే నాన్న మా అమ్మ పుష్పవల్లిని పెళ్లి చేసుకున్నారు. ఆమెపై ప్రేమ లేకుండానే ఇద్దరు పిల్లలను కన్నారా? సినిమాలో తన తండ్రి గురించి చూపించింది అంతా అవాస్తవం అన్నారు కమలా సెల్వరాజ్.

English summary
"The role of my father was misinterpreted in the film" Gemini Ganesan daughter Kamala Selvaraj fires on Mahanati Team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X