»   »  ‘రామ్ లీల’ లో రామ్ చరణ్

‘రామ్ లీల’ లో రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘గోవిందుడు అందరివాడేలే' గత ఏడాది దసరా కానుకగా విడుదలైన యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమా వర్క్ అవుట్ కాకపోయినా రామ్ చరణ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని తెచ్చి పెట్టింది. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమాని తమిళంలో రిలీజ్ చెయ్యడానికి సిద్దమవుతున్నారు. తమిళంలో ఈ సినిమాకి ‘రామ్ లీల' అనే టైటిల్ ని ఖరారు చేసారు.

‘Govindudu Andarivadele’ to release in Tamil

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తమిళంలో కూడా రామ్ చరణ్ కి డీసెంట్ మార్కెట్ ఉంది. గతంలో రామ్ చరణ్ నటించిన ‘మావీరాన్' (మగధీర డబ్ వెర్షన్) సినిమా అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాకి అక్కడ బాగానే క్రేజ్ ఉంది. అలాగే తమిళంలో కూడా బాగా ఫేమస్ అవడమే కాకుండా అక్కడి స్టార్ హీరోలతో సినిమా చేస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఉండడంతో తమిళ నిర్మాతలు అక్కడ కూడా విజయం సాధిస్తుందని అంటున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రాల వివరాలకి వెళ్తే...
రామ్‌చరణ్‌ హీరోగాగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. మార్చి 5న చిత్రాన్ని ప్రారంభిస్తారు. 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్ మొదలవుతుంది. ఈ విషయాలను ధృవీకరిస్తూ నిర్మాత మీడియాకు ప్రకటన విడుదల చేసారు.

‘Govindudu Andarivadele’ to release in Tamil

దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. అక్టోబరు 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు. ఈ సినిమాకు 'కొలవెరి...' ఫేమ్‌ అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan and Kajal Aggarwal starrer ‘Govindudu Andarivadele’ is now releasing in Tamil as ‘Ramleela’.
Please Wait while comments are loading...