»   » భారతిరాజాకి భార్యగా శ్రీదేవి

భారతిరాజాకి భార్యగా శ్రీదేవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అలనాటి ప్రముఖ దర్శకుడు భారతిరాజాతో.. అతిలోకసుందరి శ్రీదేవి జతకడుతోంది. బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించిన శ్రీదేవిని '16 వయదినిలే' (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రం ద్వారా హీరోయిన్ ను చేశారు భారతిరాజా. ఇప్పుడు తను గురువుగా భావించే భారతిరాజాకు భార్యగా నటిస్తోంది శ్రీదేవి.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం 'త్రిష ఇల్లనా నయనతార'. ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఇందులో నయనతార, త్రిష అతిథి పాత్రల్లో కనిపించే అవకాశాలున్నాయి.

ఇక మన అతిలోక సుందరి శ్రీదేవి హాలీవుడ్‌ తెరపై తళుక్కున మెరవబోతోందనే వార్త నిజమేనని తేలింది. ఆస్కార్‌ పురస్కారం అందుకొన్న నటి మెరిల్‌ స్ట్రీప్‌తో కలిసి నటించబోతోంది. కొన్నాళ్లుగా శ్రీదేవి హాలీవుడ్‌ ప్రవేశం గురించి వూహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్త నిజమేనని తాజాగా శ్రీదేవి ప్రకటించింది. చర్చలు అయితే గత కొంత కాలంగా జరుగుతున్నాయని, ఏదీ పైనలైజ్ కాలేదని తేల్చి చెప్పింది.

Gv Brings Evergreen Combo Bharathi Raja - Sridevi

'కౌబాయ్స్‌ అండ్‌ ఇండియన్స్‌' పేరుతో అమి రెడ్‌ఫోర్డ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆమె నటించబోతన్నట్లు తెలిపింది. అమి ప్రముఖ నటుడు, దర్శకుడైన రాబర్ట్‌ రెడ్‌ఫోర్డ్‌ కూతురు. భారతీయ నేపథ్యమున్న కథ కావడంతో ఇందులో ఓ పాత్రకోసం శ్రీదేవిని ఎంచుకోవాలని యూనిట్ నిర్ణయించుకుంది. కొన్నాళ్లుగా అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయం గురించి శ్రీదేవి ఖరారు చేసింది.

శ్రీదేవి మాట్లాడుతూ ''హాలీవుడ్‌ చిత్రంలో నేను నటించబోతున్న మాట వాస్తవమే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తను''అని చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కి స్టార్‌ హోదాని తెచ్చిన అందం శ్రీదేవి సొంతం. ఆమె బోనీకపూర్‌ని పెళ్లి చేసుకొన్నాక కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. ఇటీవల 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' సినిమాతో రెండో ఇన్నింగ్స్‌ని విజయవంతంగా మొదలుపెట్టింది. ప్రస్తుతం భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది శ్రీదేవి.

మరో ప్రక్క అమితాబ్‌.. శ్రీదేవి కలిసి తిరిగి జంటగా కనిపించనున్నారు. పైగా వీళ్లిద్దరూ కలసి నటించిన సూపర్‌హిట్‌ సినిమా సీక్వెల్‌లోనే తిరిగి జంటగా కనిపిస్తారని చెబుతున్నారు. ఆ సినిమానే 'ఖుదాగవా'. ముకుల్‌ ఆనంద్‌ దర్శకత్వంలో 1992లో తీసిన ఈ సినిమా రెండోభాగం ఇంకా స్క్రిప్టు దశలోనే ఉన్నప్పటికీ, నిర్మాత మనోజ్‌ దేశాయ్‌ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఖుదాగవా అందరినీ అలరించిన చిత్రం. దీని కొనసాగింపు కథపై అమితాబ్‌తో మాట్లాడాం కూడా. ఆయన ఆసక్తి కనబరిచారు. స్క్రిప్టు పూర్తికాగానే బిగ్‌బీని మళ్లీ కలుస్తాం' అన్నారు. అమితాబ్‌ సరే అనగానే శ్రీదేవిని కూడా కలుస్తాం. మిగతావాళ్లంతా కొత్తనటీనటులే ఉంటారన్నారు. బహుశా వచ్చే ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌మీదకు వెళ్లచ్చంటున్నారు.

English summary
Even before the completion of his first film, Gv announced his next 'trisha Illana nayanthara". The film is directed by debutant of atik . The story of this film revolves in a comic way and presentation of atik impressed by Gv Additional information is that There is a two roles in the film which plays a imporant, lot of name will listed and finally Gv suggessted that Barathiraja and Sridevi to play the role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X