»   » భారీ ప్రమాదం నుండి తప్పించుకున్న హీరో

భారీ ప్రమాదం నుండి తప్పించుకున్న హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే తమిళంలో స్టార్ సంగీత దర్శకుడిగా ఎదిగిన జివి ప్రకాష్ కుమార్.... ప్రస్తుతం నటుడిగానూ మారి తన సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్... అటు మ్యూజిక్ డైరెక్షన్ కొనసాగిస్తూనే ఇటు హీరోగానూ రాణిస్తున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జీవి ప్రకాష్ కుమార్ షూటింగులో భారీ ప్రమాదం నుండి బయట పడ్డాడు. ప్రస్తుతం జివి ప్రకాష్ నటిస్తున్న 'కడవుల్ ఇరుక్కన్ కుమార' షూటింగ్ పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగులో ఆయన కారును ఓ కంటైనర్ ఢీ కొట్టినట్లు సమాచారం.

GV Prakash escapes unhurt while shooting for film

ప్రమాదం జరిగిన సమయంలో కారులో జివి ప్రకాష్ కుమార్ తో పాటు బాలాజి కూడా ఉన్నారు. అయితే అదృష్ట వశాత్తు ఇద్దరూ చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు. రాజేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నిక్కి గర్లాని, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

రొమాంటిక్ ఏ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ ప్రమాద సంఘటనతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపి వేసారు. ప్రకాష్, బాలాజీ ఇద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దగా ప్రమాదం ఏమీ జరుగలేదని, చిన్న పాటి గాయాలే అని, వారు కోలుకున్న వెంటనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

English summary
G V Prakash is busy shooting for his next movie 'Kadavul Irukkan Kumaru' directed by Rajesh. The shooting is happening in Pondicherry. G.V.Prakash and RJ Balaji who were shooting for a scene when the accident occured, had a miraculous escape with small injuries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu