ఒకేసారి ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న ధనుష్?
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ ఎలాంటి సినిమా చేసినా కూడా రొటీన్ కు భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా అతను తెలుగు మార్కెట్ పై కూడా కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వచ్చిన కర్ణన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం చాలామంది హీరోలు భాషతో సంబందం లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సినిమాలు చేస్తున్నారు. ధనుష్ కూడా మొదటిసారి ట్రిలాంగ్యువల్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది. అయితే అంతకంటే ముందే తన 44వ సినిమాను మిత్రన్ జవహర్ తో పూర్తి చేయనున్నాడు.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాలో ధనుష్ సరసన ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిత్యా మీనన్, ప్రియా భవాని శంకర్, హన్సిక మోత్వాని ఆ సినిమాలో నటించనున్నట్లు సమాచారం.
రొమాంటిక్ సోషల్ డ్రామాగా రానున్న ఆ సినిమాపై ధనుష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. ఇక శేఖర్ కమ్ముల సినిమా మాత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. ఆ సినిమా కూడా మంచి సందేశంతో తెరకెక్కనుంది. తమిళ రాజకీయాల నేపథ్యంలో కథను అల్లినట్లు కూడా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











