twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ద్రోహిని కానంటూ స్టార్ హీరో స్టేజీపై ఆవేదనగా...

    By Srikanya
    |

    చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజీని సొంతం చేసుకుంటున్న తమిళ యువ నటుడు విజయ్‌. నాడు 'తుపాకి'తో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన విజయ్‌.. తాజాగా 'కత్తి'పట్టారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన నాటినుంచే సమస్యలు చుట్టుముట్టాయి. చిత్ర నిర్మాత రాజపక్సకు బంధువని తమిళ సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించగా.. పలువురు అడ్డుకునేందుకు కూడా యత్నించారు.

    విజయ్‌ మాట్లాడుతూ.. ''నేను తమిళుణ్ని. తమిళుల వల్లే ఈ స్థాయికి ఎదిగాను. మరి అలాంటి జాతికి ద్రోహం చేస్తానా? నేను ద్రోహిని కాను. నా అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చేరీతిలోనే నడుచుకుంటాను''అని చెప్పారు.

    Hero Vijay Said he is Not A Traitor

    దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ మాట్లాడుతూ.. '' నేను డబ్బు కోసం హిందీలో సినిమాలు తీయలేదు. చెన్నై నుంచి వచ్చిన వారికి కూడా బాలీవుడ్‌లో సినిమాలు తీయడం సాధ్యమేనని నిరూపించేందుకే వెళ్లాను. నేను అసలు సిసలైన తమిళుణ్ని. నాకు తమిళాభిమానం ఎక్కువ. అందుకు భిన్నంగా ఎప్పటికీ నడుచుకోను''అని పేర్కొన్నారు.

    ఈ చిత్రంలో విజయ్‌ జీవానందం, కదిరేశన్‌ అనే రెండు పాత్రల్లో విజయ్‌ నటిస్తున్నారు. 'తుపాకి'తో పోలిస్తే అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది.'జిల్లా' తర్వాత 'ఇలయ తలబది' విజయ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కత్తి'. 'తుపాక్కి' తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారాయన. ఇందులో తొలిసారిగా విజయ్‌ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ముంబయిలో పలు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. విజయ్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో స్లీపర్‌సెల్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'తుపాక్కి' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

    దీంతో మురుగదాస్‌ అంటేనే వందకోట్ల మార్కెట్‌ను సునాయాసంగా ఛేదించగలడనే నమ్మకం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బలంగా నాటుకు పోయింది. ఆ దిశగా ఈ సినిమా కూడా వందకోట్లను వసూలు చేస్తుందని సంబంధిత వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా పోస్టర్లు, టీజర్‌లు కూడా మంచి ఆదరణను సంపాదించుకున్నాయి.

    విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్లలో విజయ్‌ భిన్నంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన భవనాలతో కూడిన చెన్నైని చూపుతూ.. ఆ సన్నివేశం విజయ్‌ ముఖం మాదిరిగా ముగిసేలా వచ్చిన టీజర్‌కు 'కత్తి'లాంటి రెస్పాన్స్‌ వచ్చింది. మరి 'కత్తి' వసూళ్ల విషయంలో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో వేచిచూడాల్సిందే.

    English summary
    Vijay said that he is not a traitor. The actor claimed that he is not a martyr to show his love for the motherland. But he whole-heartedly said that he would never endorse anything that goes against the will of his people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X