»   » పందెం కోడి సంచలన నిర్ణయం.. తగ్గే ప్రసక్తే లేదు!

పందెం కోడి సంచలన నిర్ణయం.. తగ్గే ప్రసక్తే లేదు!

Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ సంచలన నిర్ణయం ప్రకటించాడు. డిజిటల్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని కొనసాగిస్తామని శుక్రవారం ప్రకటించాడు. తమిళ చిత్ర పరిశ్రమ బంద్ తో ఇప్పటికే పలు చిత్రాల విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. డిజిటల్ ప్రొవైడర్లు తగ్గే వరకు తమ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకుని వెళతామని విశాల్ ప్రకటించాడు. ఈ పోరాటంలో తమ సొంత ప్రయోజనం లేదని, టికెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుడిపై అదనపు భారం పడకూడదనేదే తమ ప్రయత్నం అని విశాల్ అన్నాడు.

Hero Vishal sensational decision on their protest.

ఈ సమావేశంలో నిర్మాతల మండలి తరుపున విశాల్, నడిగర్ సంఘం తరుపున హీరో కార్తీ పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. ప్రేక్షకుడిపై భారం మోపకుండా ఈ సమస్యని పరిష్కరించుకునే మార్గాలు చాలా ఉన్నాయని విశాల్ అభిప్రాయపడ్డారు. ఆదిశగా డిజిటల్ ప్రొవైడర్లు చర్చకు వస్తే స్వాగతిస్తామని తెలిపాడు. నిర్మాతల మండలి డిమాండ్ లకు ఓకే చెప్పే వరకు తమ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకుని వెళతామని విశాల్ ప్రకటించాడు. తమిళనాడులో పలు చిత్రాలు విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

English summary
Hero Vishal sensational decision on their protest. Kollywood continuing strike against digital providers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X