For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్టేజిపైనే నటుడిని కొట్టిన హీరో విశాల్.. అట్టర్ ఫ్లాప్ ప్లాన్.. ఏమైందంటే?

  |

  ప్రముఖ నటుడు విశాల్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులో కూడా హీరోగా మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మాత్రం అతను బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోవడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం తెలుగులో కూడా మీడియం రేంజ్ హీరోల తరహాలో మంచి కలెక్షన్స్ ఐతే అందుకున్నాడు. విశాల్ తరచుగా తమిళ్ తెలుగులో తన సినిమాలను ఒకేసారి విడుదల చేస్తూ ఉంటాడు. ఇక త్వరలోనే లాఠీ అనే మరో విభిన్నమైన సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమా ఈవెంట్ లో అతను చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

   ఒకప్పుడు మంచి హిట్స్

  ఒకప్పుడు మంచి హిట్స్

  తెలుగులో పందెంకోడి, అభిమన్యుడు, సెల్యూట్, పూజ సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్న విశాల్ మినిమం రేంజ్ లో అయితే వసూళ్లను సొంతం చేసుకున్నాడు తెలుగు ప్రేక్షకులు కూడా తనను ఎంతగానో ఆదరిస్తున్నారని ఒకానొక సమయంలో డైరెక్టుగా తెలుగులో కూడా సినిమా చేశాడు. కానీ ఆ సినిమా రిలీజ్ అయినట్లు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు.

  మళ్ళీ సక్సెస్ కోసం...

  మళ్ళీ సక్సెస్ కోసం...

  విశాల్ ఎక్కువగా తన సొంత ప్రొడక్షన్ సినిమాలను నిర్మించుకుంటాడు. ఇక ఇటీవల కాలంలో విభిన్నమైన దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ అయితే అందుకోవడం లేదు. ఇక నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

  విశాల్ హార్డ్ వర్క్

  విశాల్ హార్డ్ వర్క్


  వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లాఠీ సినిమాలో విశాల్ గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో నటించినట్లు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా అర్థమైంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అతను బాగానే హార్డ్ వర్క్ చేసినట్లు ఆ మధ్య వచ్చిన యాక్సిడెంట్ వార్తల ద్వారా అర్థం అయింది. అయితే ఇటీవల సినిమా ప్రమోషన్ డోస్ పెంచాలని అనుకున్నారో లేక సరదాగా చేయాలని అనుకున్నారో ఏమో గానీ విశాల్ వేసిన ఒక ప్లాన్ బెడిసికొట్టింది.

  విశాల్ పై అలాంటి కామెంట్స్

  విశాల్ పై అలాంటి కామెంట్స్

  తమిళంలో రోబో శంకర్ అనే నటుడు లాఠీ సినిమా ఈవెంట్ జరుగుతుండగా స్టేజ్ మీదకు వచ్చి ఇంతకు ముందు రెండు సినిమాల్లో మీతో నటించానని అయితే మిగతా వారికి ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఎందుకు ఇవ్వరు అర్థం కావడం లేదు అని అన్నాడు. అలాగే కొంచెం ఆ విషయంలో మరోసారి ఆలోచిస్తే మంచిది అని రోబో శంకర్ కాస్త విశాల్ ను తగ్గిస్తున్నట్లు మాట్లాడటంతో ఒక్కసారిగా అతనికి కోపం వచ్చినట్లు కనిపించాడు.

  మైక్ లాగేసుకుని..

  మైక్ లాగేసుకుని..

  ఇక వెంటనే విశాల్ రోబో శంకర్ దగ్గర మైకు లాగేసుకుని అతని పై చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో నటుడు సూరి స్టేజ్ దిగే ప్రయత్నం చేశాడు. ఇక కోపంగా వెళ్లిపోతున్నాడు ఏమో అని అనుకున్న విశాల్ ఇది ప్రాంక్ అని చెప్పుకున్నాడు.

  విశాల్ పై ట్రోల్స్

  విశాల్ పై ట్రోల్స్

  నిజానికి వారు ప్రాంక్ ప్లాన్ చేసినప్పటికీ కూడా అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో పై ట్రోల్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. కనీసం ప్లాన్ చేసుకొని కూడా ప్రాంక్ వీడియో సరిగ్గా చేయలేదని కొట్టే సమయంలో విశాల్ నవ్వాడు అని అలాగే సూరి కూడా నవ్వుకుంటూ జంప్ అయినట్లు సెటైర్స్ వేస్తున్నారు. నిజంగా ఇది ప్రాంక్ కాదని బెడిసికొట్టిన పెద్ద జోక్ అని విశాల్ పై గట్టిగానే ట్రోలింగ్ జరుగుతోంది.

  English summary
  Hero Vishal shocking prank video trolling in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X