Don't Miss!
- Sports
సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!
- News
ఉపాది హామీ పథకానికి తూట్లు పొడిచిన కేంద్రం.!మరోసారి మండిపడ్డ కల్వకుంట్ల కవిత.!
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Trisha Krishnan కి కరోనావైరస్ పాజిటివ్.. నరకం అనుభవించానంటూ అంటూ పోస్ట్
దేశవ్యాప్తంగా సిని పరిశ్రమను కరోనావైరస్ వెంటాడుతున్నది. సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖులకు కోవిడ పాజిటివ్ అని తేలగా, టాలీవుడ్‌లో మహేష్ బాబు, మంచు లక్ష్మీ, తమన్ లాంటి వాళ్లు కరోనా బాధితుల చేరారు. తాజాగా దక్షిణాది హీరోయిన్ త్రిషా కృష్ణన్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. తనకు కరోనావైరస్ సోకిన విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

గత కొద్ది రోజులుగా త్రిషా కృష్ణన్‌ను దగ్గు, జలువు, జలుబుతో బాధపడుతున్నారు. కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో ఆమె రోగ నిర్ధారణ పరీక్షలు జరిపించుకొన్నారు. దాంతో ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో తనకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా వెల్లడిస్తూ.. అన్ని రకాల జాగ్రత్తలు, సురక్షిత ప్రమాణాలను తీసుకొన్నప్పటికీ.. నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
కొత్త సంవత్సరంలో కరోనా లక్షణాలు కనిపించాయి. గత వారం రోజులుగా నేను భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను తీసుకొన్న వ్యాక్సిన్స్ నన్ను కాపాడాయి. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని కోరుకొంటున్నాను. ఇప్పుడిప్పుడే నేను కోలుకొంటున్నాను. కోవిడ్ పరీక్షలు జరిపించుకొన్నాను. నేను నెగిటివ్ అని తేలితే.. మళ్లీ ఇంటికి రావాలని ప్రయత్నిస్తున్నాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకొన్న ప్రతీ ఒక్కరికి, నా ఫ్యామిలీకి, నా స్నేహితులకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని త్రిష తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు పెట్టారు.