twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ యూనివర్శిటీ హీరో విక్రమ్ కి డాక్టరేట్ ప్రధానం చేసింది

    By Srikanya
    |

    జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్‌ యుయుపిఎన్ మిలన్ ఇటలీ యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ను పొందారు. మిలన్‌లోని యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రొ. డాక్టర్ మార్కో గ్రాప్సియా నుండి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. యూరప్ దేశాల నుండి తొలిసారిగా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి భారతీయ నటుడుగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ పురస్కారం అందుకోవడం సరికొత్త ఆనందాన్ని ఇస్తోందని ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రస్తుతం విక్రమ్ నటించిన నాన్న చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

    ఇక నాన్న చిత్రంలో పాత్ర గురించి చెబుతూ..ఇప్పటివరకు నేను చేసిన శేతు, శివపుత్రుడు, అపరిచితుడు, రావణ్ వంటి చిత్రాలు ఒక ఎత్తయితే 'నాన్న" మరో ఎత్తు అవుతుంది. ఈ చిత్రంలో ఐదేళ్ల బాలుడికి ఎంత మానసిక ఎదుగుదల ఉంటుందో నాకూ అంతే. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను.12 కిలోలు బరువు తగ్గాను. మానసిక ఎదుగుదల లేనివారిని పరిశీలించి వారి నడక, నడత ఎలా ఉందో క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఈ పాత్ర చేశాను అన్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం విజయ్ దర్శకత్వంలో ఎం.చింతామణి ఈ చిత్రాన్ని నిర్మించారు.

    English summary
    Chiyaan Vikram should be a happy and proud man. The man who rose to greater heights in Tamil cinema by dint of his hardwork, has added one more feather to his cap now by being chosen for the Honorary doctorate to be conferred on him by Universita Popolare Degli Studi Di Milano, Italy for his excellence in fine arts (acting). He has been chosen for the rare honour for doing varied roles in his films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X