»   » నాకు అతనితో సంభంధం లేదంటే వినరేం? హన్సిక

నాకు అతనితో సంభంధం లేదంటే వినరేం? హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుదేవాతో హన్సిక కనెక్షన్...నయనతారకు మండిపోతోంది వంటి హెడ్డింగులతో తెలుగు,తమిళ మీడియాలో వస్తున్న వార్తలను చూసి హన్సిక మండిపడిపోతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో ఆమె 'ఎంగేయుం కాదల్‌" (ప్రేమ సర్వాంతర్యామి) చిత్రంలో జయం రవి సరసన చేస్తోంది. ఆ సమయంలో ఆమెను చాలా జాగ్రత్తగా ప్రభుదేవా డీల్ చేస్తున్నాడంటూ వినపడ్డాయి. దాంతో కంగారుపడ్డ హన్సిక వెంటనే..ప్రభుదేవాను తాను అన్నగా చూస్తానని, అలాగే ఆయన కూడా చెల్లి అని గౌరవిస్తూంటాడని స్టేట్ మెంట్ ఇచ్చింది. అయినా వీరిద్దరి రిలేషన్ పై వార్తలు రావటం ఆగలేదు. దాంతో మీడియావారి పై డైరక్ట్ ఎటాక్ కి దిగింది. అన్నా చెల్లె లు సంభంధాన్ని కూడా వక్రమార్గంలో చూస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. వారిని సైకో వార్డులకు పంపాలి అంది. అలాగే ట్విట్టర్ లో ఈ విషయం పై స్పందిస్తూ...కొంతమంది పనిగట్టుకుని, నాకూ ప్రభూసార్ కి మధ్య ఏలో లింక్ ని పెడుతూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆయన నాకు పెద్ద అన్నయ్య లాంటివాడని చెప్తున్నా వినిపించుకోవటం లేదు. దయచేసి మా ఇమేజ్ లతో ఆడుకోవద్దని కోరుతున్నాను అంది. అది సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu