»   » ‘కబాలి’ ..మీ శైలి కాదని రజనీకి చెప్పా, చిరు తో,కమల్ తో నెక్ట్స్ చేస్తా

‘కబాలి’ ..మీ శైలి కాదని రజనీకి చెప్పా, చిరు తో,కమల్ తో నెక్ట్స్ చేస్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

  చెన్నై: 'కబాలి'చూశా. ఆ వెంటనే రజనీసార్‌కు ఫోన్‌ చేసి కూడా మాట్లాడా. 'సర్‌ ఇది మీ శైలి సినిమా కాదు. అలాగే రంజిత్‌ సినిమా కూడా కాదు. మంచి డాన్‌ చిత్రంలో అద్భుతంగా నటించారుఅని చెప్పా ఆయన నవ్వారు'..అంటున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్. ఆయన కబాలికు ముందు చిత్రం లింగా ని డైరక్ట్ చేసారు.

  'పురియాద పుదిర్‌' సినిమా ద్వారా దర్శకుడిగా అడుగుపెట్టిన ఆయన... రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శరత్‌కుమార్‌, విజయ్‌, అజిత్‌, సూర్య తదితర హీరోలతో సినిమాలను రూపొందించారు. తెలుగులో చిరంజీవి, నాగార్జునలతోనూ పనిచేశారు. అధికంగా తన డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం కన్నడ నటుడు సుదీప్‌ హీరోగా 'ముడింజా ఇవన పుడి' రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు.


  I Told Rajinikanth That 'Kabali' Is Neither A Ranjith Nor A Rajini Film: KS Ravikumar

  ఇక తెలుగులో నేరుగా సినిమా చేసే అవకాశం గురించి మాట్లాడుతూ.. చిరంజీవి, నాగార్జునలతో కలిసి సినిమాలు చేశా. అక్కడ కూడా మంచి గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీ అయిపోవడంతో నేరు సినిమాలను చేయలేకపోయా.


  కానీ ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లా. చాలా సంతోషించారు. 'మనం మళ్లీ ఓ సినిమా చేయాల'ని పేర్కొన్నారు. తప్పకుండా చేద్దామని చెప్పా. అన్నీ కుదిరితే మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను త్వరలోనే పలుకరిస్తా అన్నారు.


  తన తదుపరి చిత్రాలు గురించి చెప్తూ...'పంచతంత్రం' రెండోభాగం చేయాలని ఎప్పుడో అనుకున్నాం. అందుకు కమల్‌ కూడా వన్‌లైన్‌ కథ చెప్పారు. అంతేకాదు.. ఆ మధ్య కమల్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా జట్టు మొత్తం ఫొటోలు తీసుకుంటూ 'పంచతంత్రం 2' అని సందడి చేశారు. దాంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా చేయాలన్న ఆలోచన ఉంది. దానికి తగిన సందర్భం కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చారు.

  English summary
  Prior to the release of Kabali, superstar Rajinikanth was under pressure to deliver a hit as his previous outing Lingaa had tanked at the box office. The man who called the shots for Lingaa, has now said that Kabali is neither a Ranjith nor a Rajini film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more