డైరక్టర్ గారు కూడా ప్రేమ విషయం బయిటపెట్టేసాడు

ఆ ప్రకటనలోనే ... ''చివరి వరకు ఆమెకు రక్షకుడిగా ఉంటా. మా పెళ్లి విషయాన్ని పత్రికల ద్వారా తెలియజేద్దామనుకుంటే.. ముందే బయటకు వచ్చింది. ఎవర్నీ మర్చిపోం. పద్ధతిప్రకారం పెళ్లి పత్రికతో అందర్నీ కలుస్తాం. అమలాపాల్ చేతిలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. నేనూ కూడా 'సైవం'తో బిజీగా ఉన్నా. ఇవి పూర్తి అయ్యాక మా వివాహం జరుగుతుంది'' అని చెప్పారు.
ఇలయ తలబది విజయ్ హీరోగా ఏఎల్ విజయ్ తెరకెక్కించిన 'తలైవా'లో అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది. ఆ సాన్నిహిత్యమో ఏమోగానీ వారిద్దరూ ప్రేమలో ఉన్న విషయం ఇటీవల బయటపడింది. విజయ్ తాను విడుదల చేసిన ప్రకటనలో.. 'ఆమె కాదు.. ఆమె హృదయం కూడా అందమైనదే' అని ఆమెను మెచ్చుకోవటం అమలాపాల్ ఆనందానికి కారణమైంది.
ప్రేమఖైదీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కోచ్చి సుందరి అమలాపాల్. ఆ చిత్రంలో ఓ గ్రామీణ యువతి పాత్రలో సహజసిద్ధంగా నటించి మెప్పించింది ఈ సుందరి. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్యతో 'బెజవాడ'లో నటించే అవకాశం సైతం దక్కించుకుందీ భామ. ఇతర కథానాయకల్లా గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న స్క్రిప్టులను ఎంపికచేసుకుని తెలివిగా ముందడుగేస్తోందీ సుందరి.
తొలిచిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకోవడమే గాకుండా ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్‌కు కూడా నామినేట్ అయ్యింది. ఇటీవల 'దైవ తిరుమగల్'తో తమిళంలో విజయాన్ని నమోదుచేసుకుంది. అదే సినిమా తెలుగులో 'నాన్న'గా విడుదలై ..ఇక్కడా గుర్తింపును పెంచింది. ఇద్దరమ్మాయిలతోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన నాయిక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.


Click it and Unblock the Notifications











