For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదొక్కటే తీరని కోరిక:తమన్నా

  By Srikanya
  |

  చెన్నై : తెలుగు, తమిళ సినీరంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిల్కీవైట్‌ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసిన ఈ ముద్దుగుమ్మకు ఓ కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందట. తమిళంలో విజయ్‌, సూర్య, కార్తీ, ధనుష్‌, జయం రవి... తెలుగులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌, నాగచైతన్య, ప్రభాస్‌ వంటి స్టార్లతో నటించింది. కానీ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌తో నటించాలన్న కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందట. ఆ అవకాశం కోసం ఆత్రుతగా ఎదరుచూస్తోంది. త్వరలోనే తన కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో ఉన్నానని చెప్తోంది తమన్నా.

  పాలబుగ్గలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మిల్కీవైట్‌ బ్యూటీ తమన్నా. మూడు సంవత్సరాలపాటు కోలీవుడ్‌లో హవా చాటిన ఈ అమ్మడు.. ఇప్పుడు తమిళ తెరపై కనిపించడం లేదు. ఆమె అభిమానులు కూడా ఈ విషయంలో నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ తో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌, ప్రభాస్‌ వంటివారితో చిత్రాలు చేసింది. మళ్లీ వారితో మరోసారి నటించనుంది. ఈ అమ్మడు మళ్లీ తమిళతెరపై దృష్టి పెట్టింది. తాజాగా కార్తీ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

  తమిళ దర్శక, నిర్మాతలకు ఫోన్లు కూడా చేస్తోందని తమిళ మీడియా కోడై కూస్తోంది. బాలీవుడ్‌లోనూ ఇలాంటి ప్రయత్నాలే కొనసాగిస్తోంది. తెలుగు, తమిళంలో అందరు హీరోలతో జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ... బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక రీసెంట్ గా తమన్నా నటించిన రెబెల్,'కెమెరామాన్ గంగతో రాంబాబు'చిత్రాలు విడుదల అయ్యీయి. అయితే ఈ రెండు చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడాయి. ముఖ్యంగా రెబెల్ చిత్రంలో ఫెయిల్యూర్ అవటమే కాక తమన్నా ఓవర్ చేసిందంటూ వినిపించింది. లారెన్స్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసాడు. ఇక 'కెమెరామాన్ గంగతో రాంబాబు'లో పవన్ కళ్యాణ్ కే క్రెడిట్ వెళ్లిపోయింది. పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం వివాదమైనా పెద్దగా కలిసి రాలేదు.

  దీనికి తోడు తమన్నాపై ఇప్పుడు హిందీ నిర్మాత సలీమ్ అక్తర్ కేసు పెడతానని కోపంతో మండిపడుతున్నారు. వదిలిపెట్టనంటూ సీరియస్ అవుతున్నారు. ఆయన 2003లో నిర్మించిన హిందీ చిత్రం 'చాంద్ సా రోషన్ చెహ్రా'చిత్రంలో ఆమె నటించింది. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు గాను 2005 నుంచి 2010 వరకు నటించే సినిమాలకు సంబంధించిన పారితోషికంలో 25 శాతం ఇవ్వాలని తమన్నాని సలీమ్ డిమాండ్ చేశారు. ఆ డబ్బు ఇవ్వనందుకు కానూ ఆమెపై కేసు పెడతానని ఆయన సీరియస్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం ..హిందీలో చేస్తున్న హిమ్మత్ వాలా రీమేక్ పైనే ఉంది.

  English summary
  Now Tamanna seems to be looking for a big comeback in Kollywood. Although she has starred with almost all the top stars in the industry yet she doesn’t seems to be satisfied. She recently expressed her desire to do at least one project each with Kamal Hassan and Rajinikanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X