Just In
- 54 min ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 56 min ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్
- 1 hr ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
- 1 hr ago
ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా
Don't Miss!
- Sports
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌట్! వీడియో
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తనకు జరిగిన అవమానం విషయమై, అబిమానులకు ఇళయరాజా రిక్వెస్ట్ (వీడియో)
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో అవమానం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అబిమానులు చాలా భాధపడ్డారు. సోషల్ మీడియాలో ఈ విషయమై వారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇది తెలుసుకున్న ఇళయరాజా వెంటనే స్పందించి, మా వన్ ఇండియా తమిళ ప్రతినిధులతో మాట్లాడారు...ఈ వీడియోలో ఆయన ఇలాంటి వివాదాలతో విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరారు. ఆయనేం మాట్లాడారో ఇక్కడ చూడండి.
ఇళయరాజాను కూడా గుర్తు పట్టని వారు ఉంటారా...ఆయన్ను కూడా చెకింగ్ పేరుతో ఇబ్బంది పెడతరా...అంటూ మండిపడుతున్నారు ఇళయరాజా అభిమానులు. ఆయకు జరిగిన అవమానంపై తమిళనాడులోని పొలిటికల్ పార్టీలు సైతం రంగంలోకి దిగి ఉన్నత స్దాయి విచారణ జరపాలి అంటున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఇళయరాజా కొన్ని రోజుల క్రితం తన కుమారుడు కార్తీక్‌రాజా,కుటుంబసభ్యులతో కలిసి మంగుళూర్ ప్రాంతంలో గల గుళ్ళూ గోపురాలు దర్శనార్థం వెళ్లారు. అనంతరం ఆదివారం రాత్రికి చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే బెంగళూర్ కెంపగౌడ వియానాశ్రయంలో ఆయన్ని అక్కడి సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగును స్కానర్ వద్ద నిలిపేసి పూర్తి తనిఖి చేపట్టారు.
అప్పుడు ఇళయరాజా వద్ద దేవుని ప్రసాదం అయిన కొబ్బరి చెక్కలు ఉండడంతో దాన్ని ఏదోగా భావించి ఆయన్ను కదలనివ్వకుండా ఇబ్బందిపెడుతూ... వస్తువులను పూర్తిగా శోధన చేయడం ప్రారంభించారు. ఇళయరాజా వివరణ ఇవ్వబోయినా వినిపించుకోకుండా వారి కుటుంబసభ్యులు సహ ఒక పక్కన నిలబెట్టారు.

దీంతో ఆగ్రహం చెందిన ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా అక్కడ సెక్యూరిటీ అధికారుల ఫొటోలు తీయటం మొదలెట్టారు. దాంతో వివాదం మరింత ముదిరింది. ఆ ఫొటోలను తొలిగించే దాకా సెక్యూరిటీ అధికారులు ఊరుకోలేదు.
అయితే అధృష్టవశాత్తు.. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక టీవీ చానల్ విలేకరి పరిస్థితిని గ్రహించి ఇళయరాజా గురించి అధికారులకు వివరించడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సహా విమానాశ్రయంలోకి అనుమతించారు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో చూసిన ఉన్నతాధికారి ఒకరు వెంటనే అక్కడికి వచ్చి ఇళయరాజాకు క్షమాపణ చెప్పి ఆయన్ని చెన్నై విమానం ఎక్కించారు.
అనంతరం ...ఇళయరాజాకు జరిగిన అవమానానికి ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు.
ఏ దేశ సంగీతదర్శకుడు చేయనటువంటి సింపోనిని చేసిన గొప్ప సంగీత దర్శకుడు ఆయన అని అన్నారు.ఆయనకు జరిగిన అవమానం గురించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.