»   » 'పీకే' రికార్డును బ్రేక్ చేసింది

'పీకే' రికార్డును బ్రేక్ చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గతంలో ఒకరోజులో అధిక వ్యూస్ వచ్చిన టీజర్‌గా అమీర్‌ఖాన్‌ నటించిన 'పీకే' చిత్రం రికార్డు సాధించింది. అయితే ఆ రికార్డును'ఇలయ దళపతి' విజయ్ నటించిన 'పులి' చిత్రం తిరగరాసింది. ఒక రోజులో 10 లక్షల కన్నా ఎక్కువ మంది అంటే ఇప్పటి వరకు ఈ టీజర్‌ను 12.5 లక్షల మంది వీక్షించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శింబుదేవన్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రం 'పులి'. శ్రీదేవి, హన్సిక, శ్రుతిహాసన్‌, సుదీప్‌ తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర టీజర్‌ రికార్డు సృష్టిస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజీ వస్తోంది. చిత్ర హక్కుల కోసం పలువురు నిర్మాతలు పోటీపడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పోస్టర్‌లో విజయ్‌ మధ్యయుగానికి చెందిన వీరుడిలా కనిపిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ నేడు విడుదల చెయ్యనున్నారు.చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ,టీజర్ ని విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Ilayathalapathy Vijay's Puli Sets A New Record, Beats Aamir Khan's PK!

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.

చింబుదేవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇది కాకుండా విజయ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ జిల్లా తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది. ప్రముఖ నటి శ్రీదేవి దక్షిణాదిన పునరాగమనం చేస్తున్న చిత్రర 'పులి'. చింబు దేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శింబు, శ్రుతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.

షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
Even as Ilayathalapathy Vijay is being trolled in social media networks like Twitter, the teaser and first look posters of Puli are quietly generating some dazzling numbers, breaking and setting records. While the teaser has crossed more than 1.2 million views on YouTube in such a sport span of time, it has been reported by Indiaglitz that Puli has set a new record for most number of posters downloaded for an Indian movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu