»   »  'పులి‌' దర్శకుడుపై హీరో విజయ్ సీరియస్

'పులి‌' దర్శకుడుపై హీరో విజయ్ సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సాధారణంగా హీరో విజయ్ చాలా కూల్ గా ఉండే వ్యక్తి. ఆయన కోపం చూసిన వారు అరుదుగా ఉంటారని చెప్తారు. అయితే ఆయన తాజాగా పులి దర్శకుడుపై సీరియస్ అయినట్లు సమాచారం. దానికి కారణం ఇచ్చిన రిలీజ్ డేట్ కి విడుదల కాకపోవటమే. సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. అయితే ఇప్పుడా డేట్ అక్టోబర్ 1 కు వెళ్లింది. దానికి కారణం గ్రాఫిక్స్ లేటు అవటమే అంటున్నారు.

ఈ విషయమై హీరో విజయ్ చాలా సీరియస్ అయినట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. ప్రాజెక్టు రిలీజ్ డేట్ ప్రకటించేటప్పుడే ఇవన్నీ అంచనా వేసుకోవాలి కదా అని విజయ్ ...దర్శకుడుపై కోపం తెచ్చుకున్నట్లు చెప్తున్నారు. అయితే తన ప్రమేయం ఏమి లేదని క్వాలిటీ అపుట్ ఫుట్ కోసం శ్రమించటం, విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్న సమయానికి రెడీ కాకపోవటంతో ఇలా తేదిని పోస్ట్ ఫోన్ చేయాల్సి వచ్చిందని చెప్పినట్లు చెప్పుతున్నారు.

శింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. అలనాటి అందాల తార శ్రీదేవి మహారాణిగా ప్రధాన పాత్రలో నటించడగా, కన్నడ నటుడు సుధీప్ విలన్‌గా నటించారు. పీటీ సెల్వకుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రం ఆడియోను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని ఎనిమిది కోట్లకు పొందినట్లు సమాచారం. ఈ చిత్రం రైట్స్ ని గతంలో తుపాకి చిత్రం రైట్స్ పొందిన ఎస్ వి ఆర్ మీడియా వారు తీసుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, హన్సిక,శృతి హాసన్ హీరోయిన్స్ కావటం, శ్రీదేవి,సుదీప్ కీలకపాత్రలో ఉండటం సినిమాకు బిజినెస్ దృష్ట్యా క్రేజ్ వచ్చిందని చెప్తున్నారు.

 Ilayathalapathy Vijay Scold Director Chimbu Deven For Postponing Puli?

విజయ్ మాట్లాడుతూ... చారిత్రక కథా చిత్రంలో నటించాలన్న కోరిక ఈ పులి చిత్రంతో తీరిందన్నారు. నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు పెట్టి చిత్రాలు నిర్మిస్తుంటే కొందరు వాటిని అక్రమంగా ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేస్తున్నారని.. దీంతో సినిమావాళ్ల శ్రమ మట్టిలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక బిడ్డ సుఖ ప్రసవం అయ్యే ముందే గర్భాన్ని కోసి చంపే చర్యగా ఉందన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.


ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.

షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
Ilayathalapathy Vijay lost his cool recently and lashed out at Chimbu Deven for postponing the much hyped movie Puli from September 17th to October 1st.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu