»   » వాళ్ళతో పాటు ఇలియానా కూడా ఓ ఇడియట్...!?

వాళ్ళతో పాటు ఇలియానా కూడా ఓ ఇడియట్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా ఇప్పుడు చేస్తున్నది ఒకే ఒక్క సౌత్ సినిమా. అదే... 'త్రీ ఈడియేట్స్' తమిళ రీమేక్! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం తను చెన్నయ్ లో వుంది. ఈ షూటింగ్ చాలా సరదాగా...ప్లెజంట్ వాతావరణంలో సాగిపోతోందని చెబుతోంది ఇలియానా.

తెలుగు చిత్ర పరిశ్రమలో అయిన గాయాలకి తమిళనాట మందు వెతుక్కుంటోంది ఇలియానా.. తెలుగులో ఎదురైన వరుస పరాజయాల్ని తమిళంలో 'నాన్బన్" (త్రీ ఇడియట్స్)రీమేక్ చిత్రంతో మరిచిపోవాలని చూస్తోంది. అయితే త్రీ ఇడియట్స్ అంత పెద్ద హిట్ అయినా కానీ దర్శకుడు, హీరోకి తప్ప మిగతావారికి, ముఖ్యంగా హీరోయిన్ కరీనాకి పెద్దగా ప్లస్ కాకపోవడంతో ఇలియానాకి ఈ సినిమా వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

కానీ ఇలియానా మాత్రం త్రీ ఇడియట్స్ చిత్రానికి శంకర్ చాలా మార్పు చేర్సులు చేశాడని చెబుతోంది. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రాన్ని ఆయన మార్చాడని అంటోంది. అలాగే తన పాత్రని గెటప్ ని కూడా కొత్తగా తీర్చి దిద్దాడని వివరించింది. ఈ చిత్రంలో తన పాత్ర పరిధి పెంచారని, కచ్చితంగా ఈ సినిమా తనకి పెద్ద ప్లస్ అవుతుందని చెబుతోంది. అంతే కాక ఈ సినిమాలో తాను నాలుగో ఇడియట్ నని అంటోంది.

ఇక ఇటీవల ఎదురైన అనుభవాల దృష్ట్యా తన సరసన నటిస్తున్న హీరోని పొగిడే పనిలో పడింది. విజయ్ గురించి తెగ చెబుతూ అతడిని, అతని అభిమానుల్ని మెప్పించడానికి చూస్తోంది. ఇక జీవా, శ్రీకాంత్ కూడా సరదా మనుషులే. వాళ్లు ముగ్గురూ ఫ్రెండ్స్ లా, ఎప్పుడూ కలిసే వుంటారు. నేను వాళ్లతో కలిస్తే నాలుగో ఈడిఎట్ ని!" అంటోంది ఇలియానా. ఇదే తెలివి శక్తి రిలీజ్ టైమ్ లోనూ ఉండుంటే ఇలియానా పని ఇలా అయి ఉండేది కాదనేది ఇండస్ట్రీ మాట.

English summary
Happy about playing the heroine’s role in the movie, she says, ‘But it is not the same character done in Hindi by Kareena Kapoor. While Shankar has made enough changes, I am trying my best not to resemble Kareena Kapoor.’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu