»   » కోర్టు మెట్లు ఎక్కనున్న సినీ నటి త్రిష.. ఆ వ్యవహారం మళ్లీ మొదటికి..

కోర్టు మెట్లు ఎక్కనున్న సినీ నటి త్రిష.. ఆ వ్యవహారం మళ్లీ మొదటికి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటి త్రిషకు విధించిన రూ.1.15 కోట్ల జరిమానాను ట్రిబ్యునల్‌ కోర్టు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో ఆదాయ పన్ను శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణను కోర్టు జూన్‌ 13వ తేదీకి వాయిదా వేసింది. 2010-11వ సంవత్సరంలో తన ఆదాయం రూ.89 లక్షలంటూ త్రిష అడ్వాన్స్‌ రిటర్నులు దాఖలు చేశారు. సినిమాల్లో నటించేందుకు అడ్వాన్సుగా తీసుకున్న మొత్తాలను ఇందులో కలపలేదు. దాంతో, అడ్వాన్సులు కూడా ఆదాయం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసిన ఐటీ శాఖ.. రూ.1.15 కోట్ల జరిమానా విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ త్రిష దాఖలు చేసిన కేసులో ట్రిబ్యునల్‌ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

త్రిష తప్పుడు లెక్కలు..

త్రిష తప్పుడు లెక్కలు..

2010-11 సంవత్సరానికి గానూ తన ఆదాయాన్ని త్రిష రూ.89 లక్షలుగా చూపించింది. అయితే ఆమె అంత తక్కువ మొత్తాన్ని ఆదాయంగా చూపించడంతో అనుమానం వచ్చిన ఐటీశాఖ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఏడాది సినిమాలకు గానూ అడ్వాన్స్ మొత్తాన్ని త్రిష ఆదాయంలో చూపలేదని అధికారులు ధ్రువీకరించారు.

1.15 కోట్ల జరిమానా

1.15 కోట్ల జరిమానా

దాడుల అనంతరం ఆ ఏడాదికి త్రిష మొత్తం ఆదాయం 3.5 కోట్ల రూపాయలుగా అధికారులు తేల్చారు. అందుకు తగ్గ పన్నును వసూలు చేయడంతో పాటు.. తప్పుడు లెక్కలు చూపినందుకు గానూ రూ.1.15 కోట్లను జరిమానాగా విధించారు. ఆదాయం పన్ను శాఖను తప్పుదోవ పట్టించారని, ఐటీశాఖ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్ దాఖలు చేశారు.

 ఐటీశాఖ కేసుపై పిటిషన్

ఐటీశాఖ కేసుపై పిటిషన్

ఐటీశాఖ తీరును నిరసిస్తూ త్రిష ఐటీ శాఖ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించింది. తను పన్ను చెల్లించాను కాబట్టి, ఫైన్‌ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా నిలిచింది. జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. అయితే ట్రిబ్యునల్ తీర్పుతో ఐటీ శాఖ వెనక్కు తగ్గలేదు. త్రిష వ్యవహారంపై మళ్లీ మద్రాస్ హై కోర్టులో కేసు వేసింది.

ట్రిబ్యునల్ తీర్పుపై ఐటీశాఖ

ట్రిబ్యునల్ తీర్పుపై ఐటీశాఖ

త్రిషకు విధించిన జరిమానా చెల్లించక్కర్లేదంటూ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఐటీ శాఖ గురువారం మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.

English summary
Trisha had to face a case filed by the income tax department in the year 2011 when they filed a complaint that she failed to pay taxes properly for the year 2010-2011. latest reports suggest that she was asked to pay a fine of Rs. 1.11 crores. Trisha’s lawyer refuted the case and managed to win it. The fines were brushed off later. However, the income tax department is not giving up and they have filed another case on the actress now at the Madras High Court.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu