Just In
- 8 min ago
ఫైనల్ గా డ్రీమ్ ప్రాజెక్టును మొదలు పెట్టిన హీరో నిఖీల్!
- 13 min ago
వాటికి నువ్ అర్హుడివే.. ‘పొగరు’పై ప్రశాంత్ నీల్ కామెంట్స్
- 25 min ago
అయ్యో పాపం.. నితిన్ మీద ఎక్కబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్!
- 51 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
Don't Miss!
- News
భారత్‌లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
పిచ్‌ను నిందించిన మాజీ క్రికెటర్లపై అశ్విన్ పరోక్ష వ్యాఖ్యలు!
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కాజల్ అగర్వాల్‌కు తృటిలో తప్పిన పెనుప్రమాదం.. వెంట్రుకవాసిలో ప్రమాదం..
విలక్షణ నటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్‌లో చోటుచేసుకొన్న ప్రమాదంతో తమిళ చిత్ర సీమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సాంకేతిక నిపుణులు, మరో పది మంది గాయాలపాలు కావడం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకొన్న వారిలో కాజల్ అగర్వాల్, కమల్ హాసన్, క్యాస్టూమ్ డిజైనర్ అమృత రామ్ ఉన్నారు.. ఈ ప్రమాద ఘటనపై క్యాస్టూమ్ డిజైనర్ అమృత రామ్ చెప్పిన విషయాలు ..

కమల్, కాజల్‌కు సమీపంలోనే
ఇండియన్ మూవీ షూటింగ్‌లో అందరూ తలమునకలై ఉన్నారు. చాలా మంది టెక్నిషియన్లు తమ పనిలో మునిగిపోయారు. ఆ పక్కనే ఉన్న ఓ భారీ క్రేన్‌కు కట్టిపడి ఉన్న పెద్ద ఎక్విప్‌మెంట్ పడిపోయింది. ప్రమాధ సంభవించిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ ఉన్నారు. షాట్ గ్యాప్‌లో రిలాక్స్ అవుతూ మాట్లాడుకొంటున్నారు. వారు కూర్చొని ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.


భారీ పరికరం పైనుంచి పడి
క్రేన్ నుంచి ఓ భారీ పరికరం పడిపోయిన ఘటనలో తృటిలో తప్పుకొన్నాను. కేవలం 10 సెకన్ల గ్యాప్‌లోనే మేము అక్కడి నుంచి తప్పించుకొన్నాం. ప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలో కమల్ సార్, కాజల్ అక్కడే ఉన్నారు. వారు ఈ దుర్ఘటన నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకొన్నారు. దేవుడి దయ వల్ల వారు సురక్షితంగా బయటపడ్డారు. కానీ మా సన్నిహితులు ప్రాణాలు కోవడం విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి భగవంతుడిని వేడుకొంటున్నాను అని అమృత రావ్ అన్నారు.

నాలుగు రోజులుగా ఫైట్ సీక్వెన్స్
ఇండియన్ 2 సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోలేదు. గత నాలుగు రోజులుగా డైరెక్టర్ శంకర్ భారీ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అంతా సవ్యంగానే జరిగిపోతున్నదనే క్రమంలోనే ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి అప్పటికే రెండు షాట్స్ పూర్తి చేశాం. మూడు షాట్ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది అని అమృత రామ్ చెప్పారు.
|
శంకర్, సినిమాటోగ్రాఫర్ షాట్ గురించి
ప్రమాద ఘటనకు సమీపంలోనే డైరెక్టర్ శంకర్, సినిమాటోగ్రఫర్ తదుపరి షాట్, లైటింగ్ గురించి చర్చిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఆ సమయంలో మానిటర్ టెంట్‌లో నేను, కమల్ సార్, కాజల్, హాలీవుడ్ మేకప్ మ్యాన్‌తో మాట్లాడుకొంటున్నాం. అప్పుడు మాకు సమీపంలో భారీ శబ్దం వినిపించింది. ఆ క్షణంలో బయటకు వెళ్లి చూస్తే క్రేన్ పడి.. దానికి కింద కొందరు చిక్కుకుని ఉన్నారు అని అమృత రామ్ అన్నారు.

షాక్‌లో కమల్, కాజల్
ప్రమాద ఘటనలో పరిస్థితి చూసే సరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కమల్ హాసన్ సార్, కాజల్ బయటకు వచ్చి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతలోనే తేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నాలు చేశాం. గత కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న వారికి ఇలాంటి ఘటన ఎదురవ్వడం చాలా బాధకరం అని అమృతరావు పేర్కొన్నారు.