»   » కమల్-విక్రమ్ కలగలిస్తే అనుష్క, నా కూతురు...

కమల్-విక్రమ్ కలగలిస్తే అనుష్క, నా కూతురు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం ‘సైజ్ జీరో'. ఈ చిత్రాన్ని తమిళంలో ‘ఇంజి ఇడుప్పళగి' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా తమిళ వెర్షన్ ఆడియో వేడుక గురువారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన నాజర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆడియో సీడీలను నాజర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సంగీత దర్శకుడు మరగథమణి(కీరవాణి) వేడుక అన్నారు. ఇళయారాజాకు థీటుగా కీరవాణి సంగీతం అందిస్తున్నారని, అందుకు బాహుబలి లాంటి చిత్రాలే నిదర్శనం అన్నారు.

తాను ఈ కార్యక్రమానికి నడిగర్ సంఘం అధ్యక్షుడిగా రాలేదని, నా కూతురు అనుష్క ఒక వైవిధ్య భరిత పాత్రలో నటించింది. అందుకే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ చిత్రంలో నటించే ముందు అనుష్క ఈ కథను నాకు చెప్పింది. ఇలాంటి వైవిధ్యకరమైన పాత్రలో నటించడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ సినిమా కోసం అనుష్క కాస్త బరువు పెరిగినా అందంగా ఉందన్నారు. ఈ చిత్రం ఒక సాధారణ చిత్రంగా కాకుండా చక్కని హాస్యం మేళవించిన వినూత్న చిత్రంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Inji Idupazhagi Audio Launch Live Updates: Anushka Is A Combination Of Kamal Haasan & Vikram!

దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి గురించి మాట్లాడుతూ.... ఆయన నాకు నటుడిగానే పరిచయం. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రంలో నేను కూడా నటించాను. ఆయనకు రాఘవేంద్రరావు కొడుకగానే గుర్తింపు ఉన్నా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తపన పడుతున్నారని, ఈ చిత్రంతో ఆయనకు తప్పకుండా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఆర్య గురించి మాట్లాడుతూ...ఆయన్ను చూసిన వారంతా హీరోయిన్లతోనే ఎక్కువ మాట్లాడతారని అనుకుంటారు, కానీ ఆయన అందరితోనూ సరదాగానే ఉంటారు. ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఇలాంటి పాత్రను ఎంచుకున్నందుకు ఆయన్ను అభినందించాలి అన్నారు.

హీరో ఆర్య అనుష్క గురించి మాట్లాడుతూ... కమల్ హాసన్, విక్రమ్ లాంటి ఇద్దరు గొప్ప నటుల కాంబినేషన్ లా అనుష్క పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సౌత్ లో ఒక స్టార్ హీరోయిన్ గా ఉండి ఆమె ఇలాంటి స్క్రిప్టు ఎంచుకోవడం ఎంతో అభినందనీయం అన్నారు.

English summary
Anushka Shetty's upcoming film Inji Idupazhagi has made all the right noises so far and quite naturally the film is surrounded by positive buzz, which makes its audio launch event an important occasion.
Please Wait while comments are loading...