»   » శంకర్‌కు షాక్..2.0 తేలేవరకు కదలనివ్వం, భారతీయడు 2 కూడా!

శంకర్‌కు షాక్..2.0 తేలేవరకు కదలనివ్వం, భారతీయడు 2 కూడా!

Subscribe to Filmibeat Telugu

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కు 2.0 ఇన్వెస్టర్లు షాక్ ఇచ్చారు. 2.0 సంగతి తేలకుండా మరో చిత్రంపై దృష్టి పెట్టడానికి వీల్లేదని శంకర్ కు ఇన్వెస్టర్లు తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 2.0 చిత్ర ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కానీ ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ ప్రక్రియ ఎంతకూ తేలడం లేదు. భారీ స్థాయిలో ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధానత్య ఉంది. దీనితో 2.0 చిత్రం విడుదల ఇంకా అయోమయంలోనే ఉంది. శంకర్ ఈ లోపు భారతీయుడు 2 చిత్ర స్క్రిప్ట్ పనుల్లో బిజీ కావడంతో ఇన్వెస్టర్ లకు, దర్శకుడికి మధ్య వివాదం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

2.0 ఆలస్యానికి అసలు కారణం ఇదే
 2015 లోనే ప్రారంభమైన 2.0

2015 లోనే ప్రారంభమైన 2.0

రోబో చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 2.0 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు 2015 లోనే ప్రారంభం అయ్యాయి. సాధారణంగా శంకర్ అనుకున్న సమయానికే సినిమాని పూర్తి చేస్తారు. కానీ 2.0 చిత్ర విషయంలో మాత్రం అలా జరగడం లేదు.సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అందాల భామ అమీజాక్సన్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

వరుసగా వాయిదాలు

వరుసగా వాయిదాలు

2.0 చిత్రం గత ఏడాది దీపావళికే విడుదల కావాల్సివుంది. కానీ చిత్రీకణ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఆ తరువాత ఈ ఏడాది జనవరిలో విడుదల అవుతుందని భావించారు. జనవరి కూడా వెళ్ళిపోయింది. ఇటీవల ఏప్రిల్ లో విడుదల అంటూ ప్రకటించారు. అది కూడా వాయిదా పడింది.

 వరుస వాయిదాలు అందుకే

వరుస వాయిదాలు అందుకే

2. 0 చిత్రంలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందబోతోంది. గ్రాఫిక్స్ వర్క్ లో జాప్యం జరుగుతుండడంతో చిత్రం వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ వర్క్ చేపడుతున్న సంస్థలతో శంకర్ విసిగిపోతున్నాడట.

 భారతీయుడు 2 తెరపైకి

భారతీయుడు 2 తెరపైకి

2.0 చిత్రం విడుదల కాకముందే భారతీయుడు 2 వార్తల్లోకి వచ్చింది. 2.0 చిత్రం ఆలస్యం అవుతుండడంతో శంకర్ భారతీయుడు 2 స్క్రిప్ట్ ని పూర్తి చేసే ఆపనిలో బిజీ అయ్యాడు. 1996 లో వచ్చిన భారతీయుడు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసారు.

 శంకర్ కు షాక్ ఇచిన ఇన్వెస్టర్లు

శంకర్ కు షాక్ ఇచిన ఇన్వెస్టర్లు

2.0 చిత్రంలో ఓ ప్రముఖ మొబైల్ సంస్థ ఇన్వెస్ట్ చేస్తునట్లు తెలుస్తోంది. శంకర్ 2. 0 చిత్రానికి పట్టించుకోకుండా భారతీయుడు 2 పై దృష్టి సారించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారట. 2.0 సంగతి తేలేవరకు మరో సినిమా పనులు చేయడానికి వీల్లేదని శంకర్ కు వార్నింగ్ ఇచ్చినట్లు మీడియలో వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికీ క్లారిటీ లేని 2.0

ఇప్పటికీ క్లారిటీ లేని 2.0

2.0 చిత్రం విడుదల విషయంలో ఇప్పటికి క్లారిటీ రావడం లేదు. శంకర్ చేయబోయే గ్రాఫిక్ మాయాజాలాన్ని ఆస్వాదించడానికి దేశవ్యాప్తగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

English summary
Investors ask director Shankar to stop Indian2 till 2.0 release. Pressure building on Shankar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu