For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dhanush భార్యతో విడాకులు.. శృతిహాసన్‌తో అఫైర్.. మరో టాప్ హీరోయిన్ అక్రమ సంబంధమే కారణమా?

  |

  తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య వైవాహిక జీవితానికి తెరపడిందనే వార్తలు సినిమా పరిశ్రమను కుదిపేశాయి. తాము ఇద్దరం విడిపోతున్నామని సోమవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోవడంతోపాటు దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే ధనుష్ మ్యారేజ్ బ్రేకప్‌కు అసలు కారణాలు ఇవే అంటూ జాతీయ మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావడం మరింత షాక్ గురిచేసింది. ధనుష్ అఫైర్లు, అక్రమ సంబంధాల వివరాల్లోకి వెళితే..

  రెండేళ్లు చిన్నవాడితో ఐశ్వర్య ప్రేమ వివాహం

  రెండేళ్లు చిన్నవాడితో ఐశ్వర్య ప్రేమ వివాహం

  ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వయసులో తన కంటే రెండేళ్లు చిన్నవాడైనా ధనుష్, ఐశ్వర్య ప్రేమకు అడ్డు కాలేదు. కానీ వారి ప్రేమ వివాహానికి ధనుష్ అఫైర్లు, అక్రమ సంబంధాలు అడ్డుగోడగా నిలిచాయనే విషయం మీడియా కథనాల్లో స్పష్టమైంది. పలువురు హీరోయిన్లతో ధనుష్ వ్యవహారశైలితో విసిగిపోయిన ఐశ్వర్య విడాకులకు మొగ్గు చూపించిందనే విషయం ఇప్పడు చర్చనీయాంశమైంది.

  శృతిహాసన్‌తో ధనుష్ అఫైర్

  శృతిహాసన్‌తో ధనుష్ అఫైర్

  ఐశ్వర్య కాపురంలో కలతలు రావడానికి ఓ కారణం శృతిహాసన్ అనేది ప్రధానంగా వినపడుతున్నది. శృతి, ఐశ్వర్య చిన్ననాటి స్నేహితులు. తన భర్త ధనుష్, స్నేహితురాలు శృతిహాసన్‌ జంటగా 3 అనే చిత్రంతో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా కోలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్, శృతిహాసన్ మధ్య అఫైర్ జోరుగా సాగిందనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. ధనుష్ అఫైర్‌ కారణంగా ఐశ్వర్య కాపురంలో కలతలు, కలహాలు చోటుచేసుకొన్నాయని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

  అఫైర్ వార్తలను ఖండించిన శృతిహాసన్

  అఫైర్ వార్తలను ఖండించిన శృతిహాసన్


  ఇక ధనుష్‌తో అఫైర్ వార్తలను శృతిహాసన్ ఖండించారు. నా వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న రూమర్లకు న్యాయం చేయలేను. వాస్తవం తెలుసుకోవడానికి నా దేహంలో మైక్రో చిప్ పెట్టి.. నన్ను ఫాలో అవ్వండి చెప్పలేను. ఒకే పరిశ్రమలో ఉన్నాం.. కలిసి పనిచేస్తున్నాం. ధనుష్ నాకు మంచి స్నేహితుడు. ప్రొఫెషనల్‌గా నాకు బాగా హెల్ప్ చేశాడు. మా గురించి ఏదో గాలి మాటలు మాట్లాడుకొంటున్నారని.. నా స్నేహాన్ని వదులుకోను అని శృతి చెప్పారు.

  ధనుష్‌కు రుణపడి ఉంటానని శృతి

  ధనుష్‌కు రుణపడి ఉంటానని శృతి

  నా గురించి, ధనుష్ గురించి ఏం మాట్లాడుకొన్నా నేను పట్టించుకోను. నా గురించి 10 వేల రూమర్లు ఉన్నా నాకేం పట్టించుకోను. 3 చిత్ర సినిమా సమయంలో ధనుష్ నాకు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. ధనుష్, నా రిలేషణ్ గురించి ఏమనుకొన్నా నేను పట్టించుకొను అని అప్పట్లో మీడియాకు శృతిహాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

  అమలాపాల్ విడాకుల వెనుక ధనుష్

  అమలాపాల్ విడాకుల వెనుక ధనుష్


  శృతి హాసన్ తర్వాత అమలాపాల్‌తో ధనుష్‌ అఫైర్ వార్త అత్యంత దుమారం లేపింది. దర్శకుడు ఏఎల్ విజయ్‌, అమలాపాల్ 2017లో విడాకులు తీసుకొన్నప్పడు అందుకు కారణం ధనుష్ అనే వార్త వినిపించింది. మా బంధంలో నమ్మకం లేకపోవడం వల్లే దాంపత్య జీవితం విఫలమైంది అని ఏఎల్ విజయ్ చెప్పారు.

  ధనుష్ వల్లే విడాకులు అంటూ ఏఎల్ విజయ్ తండ్రి

  ధనుష్ వల్లే విడాకులు అంటూ ఏఎల్ విజయ్ తండ్రి

  అయితే అమల పాల్, తన కొడుకు విడిపోవడానికి కారణం ధనుష్ అంటూ ఏఎల్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకుతో వివాహం తర్వాత అమలా పాల్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకొన్నారు. కానీ అమలా పాల్‌కు ధనుష్ అమ్మ కనక్కు అనే సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమాలో నటించాలని అమలాపాల్ నిర్ణయం తీసుకోవడమే తన కొడుకు కాపురంలో నిప్పులు పోసిందని ఏఎల్ విజయ్ తండ్రి ఏఎల్ అజగప్పన్ చెప్పారు.

  Actor Kamal Haasan Tests Covid Positive || Filmibeat Telugu
  ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు గురించి ధనుష్

  ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు గురించి ధనుష్

  ఇలాంటి రూమర్లు, ఊహాగానాల మధ్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోతున్నట్టు ఇన్స్‌టాగ్రామ్‌లో ధనుష్ పోస్టు పెట్టారు. 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలు, తల్లిదండ్రులుగా, ఒకరికొకరం సన్నిహితులుగా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మా మధ్య సన్నిహిత సంబంధాలు, అవగాహన, సర్దుబాట్లు చోటు చేసుకొన్నాయి. కానీ మేము కలిసి జీవించలేమనే పాయింట్‌కు చేరుకొన్నాం. ఐశ్వర్య నేను భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాం. వ్యక్తిగతంగా ఒకరికొకరం సంపూర్ణంగా అర్దం చేసుకోనేందుకు సమయం తీసుకొంటున్నాం. మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, మా ప్రైవసీని అర్ధం చేసుకొంటారని అనుకొంటున్నాను. ఓ నమశ్శివాయ. ప్రేమతో అంటూ ధనుష్ అంటూ పోస్టు పెట్టారు.

  English summary
  Dhanush divorce with Aishwarya Rajinikath goes prime topic in national media. Reports suggest that Shruti Haasan, Amala Paul reason behind Dhanush divorce.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion