twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నం కొత్త సినిమా గురించి సుహాసిని

    By Srikanya
    |

    చెన్నై : కడల్‌ను తెరకెక్కించి పరాజయాన్ని చవిచూసిన మణిరత్నం... మరో కొత్త చిత్ర చిత్రానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయమై ఆయన భార్య,నటి సుహాసిని మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లో... ఇండో-పాక్‌ సంబంధాలు నేపథ్యంగా దర్శకుడు మణిరత్నం ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమాకి ఇళయరాజా స్వరాలు సమకూరుస్తారని వార్తలొచ్చాయి. అయితే ఆ బాధ్యతలు ఎ.ఆర్‌.రెహమాన్‌కే అప్పగించబోతున్నట్లు సుహాసిని వెల్లడించారు. చిత్రానికి లజ్జో అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఓ పీరియడ్ ఫిల్మ్.

    ఇక ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్,కరీనా కపూర్ కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ ఏమిటంటే....భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం అందరికీ తెలిసిందే. భారత్‌-పాకిస్తాన్‌ విడిపోయిన సందర్భాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, దానికి కాస్త ప్రేమకథను కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. సంచలన చిత్రాలను తెరకెక్కించే మణిరత్నం కథకు ఇప్పుడు ఈ అంశమే ముడిసరకుగా మారినట్లు సమాచారం.

    ప్రస్తుతం కొత్త చిత్రం పనుల్లోనే మణిరత్నం పూర్తిగా ఉన్నారని తెలుస్తోంది. అమీర్ ఖాన్ కి స్టోరీ లైన్ నచ్చిందని, స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. హిందీలో వచ్చిన 'రంగ్‌దే బసంతి', 'కుర్బాన్‌' చిత్రాలకు కథ అందించిన రెన్సిల్‌ సిల్వా ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

    అమీర్ ఖాన్, కరీనా కపూర్ కలిసి...గతంలో 3 ఇడియట్స్ అనే సూపర్ హిట్ లో చేసారు. అలాగే అమీర్ లేటెస్ట్ తలాష్ చిత్రంలో కూడా ఆమె నటించింది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో లో వచ్చిన యువలో ఆమె చేసింది. అయితే ఈ చిత్రం తమిళ వెర్షన్ లో కూడా ఈ పెయిరే ఉంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అమీర్ ఖాన్ కి మొదటి నుంచి మణిరత్నం అంటే అభిమానం. ఆయన దర్శకత్వంలో చేయాలని అమీర్ ఎప్పటినుంచో చెప్తూ వస్తున్నారు.

    English summary
    
 The media was abuzz with the rejoining of maestro Illairaja and director Mani Ratnam. However, Mani will be going ahead with AR Rahman for his next film too. After the debalce of Kadal, the film maker has been keeping a low profile and it is heard that he will be making a Hindi film, based on the India - Pakistan partition. It is reported that the period film will be titled Lajjo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X