డైరెక్ట్ గా ఓటీటీ విడుదలకు సిద్దమైన ధనుష్ మూవీ.. ఒకేసారి 17 భాషల్లో బిగ్గెస్ట్ రిలీజ్!

లోకప్ కాన్సెప్ట్ లకు కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్రేజ్ అందుతోంది. ఎప్పుడైతే ఓటీటీ హవా ఎక్కువయ్యిందో అప్పటి నుంచి ఇండియా సినిమాలకు కూడా విదేశాల్లో మంచి క్రేజ్ దక్కుతోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ కొన్ని సినిమాలను వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేస్తుండడం వైరల్ గా మారింది. ఇక ధనుష్ కొత్త సినిమాను కూడా అదే తరహాలో భారీగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన జగమే తందిరం అనే సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 18న సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. మొదట ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన థియేటర్స్ ఓపెన్ గా లేకపోవడంతో ఓటీటీ డీల్ కు ఒప్పుకోక తప్పలేదు. తెలుగులో ఈ సినిమాను జగమే తంత్రం అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.

Jagame Thandhiram On Netflix from June 18 streaming in 190 Countries

నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ హక్కులను 55కోట్లకు కొనుగోలు చేసింది. పెట్టిన బడ్జెట్ కు ఇది మంచి ప్రాఫిట్. అందుకే నిర్మాతలు పెద్దగా ఆలోచించకుండా రిలీజ్ హక్కులను ఇచ్చేశారు. ఇక 190 దేశాల్లో 17 భాషల్లో సందడి చేయనున్న ఈ మూవీ తప్పకుండా ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ధనుష్ చివరహా కర్ణన్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X